క్రైమ్/లీగల్

ఏటీఎం వద్ద రూ.58.97లక్షల లూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, మే 7 : హైదరాబాద్‌లోని వనస్థలిపురం పనామా కూడ లి వద్ద మంగళవారం ఉదయం ఏటీఎం వద్ద భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు సెక్యూరిటీ కార్డు దృష్టి మళ్లించి రూ.58.97లక్షలు ఎత్తుకెళ్లారు. ఏటీయంలో నగదు జమచేసే సెక్యూరిటీ గార్డ్ కళ్లుకప్పి వనస్థలిపురంలో భారీ నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదును జమచేసే రైటర్‌సేఫ్ గార్డ్ సంస్థ మంగళవారం ఉదయం వనస్థలిపురం పనామా చౌరస్తాలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు జమచేసేందుకు సంస్థ సిబ్బంది (ఏపీ09టీవీ 2864) వాహనంలో వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది మహ్మద్ తాహ, విజయ్‌లు ఏటీయంలో మూడు లక్షల నగదును జమచేసేందుకు ఏటీయంలోకి వెళ్లారు. టాటా సుమో వాహనంలో రక్షణ కోసం మరో సెక్యూరిటీ అధికారి నాగేందర్‌తో పాటు డ్రైవర్ శక్తి కుమార్‌లు కుర్చున్నాడు. గుర్తుతెలియని దుండగుడు ఏటీఎం నుండి నగదు తీసుకొచ్చిన వాహనం వరకు వంద రూపాయల నోట్లను వేస్తూ వచ్చి మీ వాహనంలోని డబ్బులు కిందపడ్డాయని నాగేందర్‌కు తెలిపాడు. వాటిని తీసుకునేందుకు నాగేందర్ వాహనం దిగగా, దృష్టి మళ్లించిన దుండగులు వాహనంలో ఉన్న రూ.58.97లక్షల పెట్టెను తీసుకొని పారిపోయారు. అప్పటికే ముఠా సభ్యులు ఆటోలో రోడ్డుకు ఇవతలివైపు వేచి ఉన్నారు. పెట్టెతో ఆటోలో ఎక్కి అక్కడి నుంచి జారుకున్నారు. తేరుకున్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాచకొండ అదనపుసీపీ సుధీర్‌బాబు, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ గాందీనారాయణ చోరీ తీరును పరిశీలించారు. నాలుగు బృందాలుగా ఏర్పడి దుండగులను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. సెక్యురిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

చిత్రం... నగదు తీసుకొచ్చిన టాటాసుమో వాహనం