క్రైమ్/లీగల్

జేబు దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 7: బహిరంగ సభలు.. సమావేశాలు.. జాతరలకు వెళతారు.. అందరిలో కలిసిపోయి అనుమానం రాకుండా కలిసి మెలిసి తిరుగుతారు.. అంతలోనే జేబు దొంగలుగా మారిపోయి దోచుకుంటూ తప్పించుకు తిరుగుతున్న ఆరుగురు సభ్యులతో కూడిన జేబుదొంగల ముఠాలో ఐదుగురిని రాచకొండ సీసీఎస్ మల్కాజిగిరి టీం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా 13 కేసుల్లో తప్పించుకు తిరుగుతూ ఎట్టకేలకు పట్టుబడ్డ దొంగల ముఠా నుంచి రూ.5.78లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ తెలిపారు. మంగళవారం ఉప్పల్ పీఎస్‌లో సీసీఎస్ అడిషనల్ డీసీపీ సలీమా, ఓఎస్‌డీ క్రైం డీ.శ్రీనివాస్ రావు, ఏసీపీ గోనె సందీప్, ఇన్‌స్పెక్టర్లు ఎస్.లింగయ్య, జగన్నాధ రెడ్డి, పీ.శివ శంకర్ రావు, శ్రీ్ధర్ రెడ్డి, ఎస్.రవి బాబు, వై.వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన కొన్ని కుటుంబాలు బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి కొనే్నళ్ల క్రితం వచ్చారు. మల్లేపల్లి మంగరి బస్తీలో నివస్తున్న వీరి పిల్లల్లో కొందరు చదువు లేకుండా పని చేయకుండా డబ్బులు సంపాదన కోసం జేబు దొంగలుగా అవతారమెత్తారు. హత్‌వల్ రవీ (19), కంబెల్ ఆకాష్ అలియాస్ జుబ్బ (22), కంబెల్ కరణ్ అలియాస్ గిడ్డియా (20), హత్‌వలి కరణ్ అలియాస్ చిన్నా (22), కంబెల్ లక్ష్మణ్ అలియాస్ శంకర్ (19) జేబు దొంగతనాలు చేసి దోచుకున్న డబ్బులు, బంగారు ఆభరణాలు వీరిలో ఒకరైన బొల్లపల్లి ఆర్తీ అలియాస్ శహనా (45) దగ్గర భద్రపరుస్తారు. అవసరమైనపుడు తీసుకుని స్వగ్రామానికి వెళ్లి ఇంటి వద్ద ఇస్తూ కొంత ఖర్చు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, జనం ఎక్కువ ఉన్న జాతరలో ఇలాంటి దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. పలు కేసులతో సంబంధం ఉన్న వీరు గత నెల 29న ఉప్పల్‌లోని క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌కు ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకుని వచ్చారు. అప్పటికే స్టేడియంలో సీసీ కెమెరాలు అడుగడుగునా ఉన్నాయి. పటిష్ఠమైన పోలీసు బందోబస్తు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అనుమానం రాకుండా తిరుగుతున్న జేబు దొంగలపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు. పైవారిలో ఆర్తీ తప్ప పై ఐదుగురు జేబు దొంగలను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టు రట్టయింది. వీరి వెనుక ఇంకెంత మంది దొంగలు ఉన్నారో విచారణ కొనసాగుతుందని డీసీపీ ఉమా మహేశ్వర్ రావు పేర్కొన్నారు.