క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ డిప్యుటీ కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 7: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపధ్యంలో కడప కమర్షియల్ టాక్స్ డిప్యుటీ కమిషనర్ లూర్దయ్య నాయుడు ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. అదే సమయంలో విజయవాడ, కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉన్న లూర్దయ్యనాయుడు ఇళ్లలో సైతం సోదాలు నిర్వహించారు. లూర్దయ్య నాయుడు కడప నగరంలోని బాలాజీనగర్ కీర్తి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నెం.104లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, రూ.4.20 లక్షల నగదు, 750 గ్రాముల బంగారం, కిలో వెండి, ఫిక్స్‌డ్ డిపాజిట్ల పత్రాలు సీజ్ చేశారు. ఇందులో కర్నూలు నగరంలోని రెండస్తుల కమర్షియల్ భవనం, చాగలమర్రిలో రెండస్తుల నివాస భవనం, 22 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.