క్రైమ్/లీగల్

అత్తాకోడళ్ల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / రాజేంద్రనగర్, మే 7: ఇంట్లో ఉన్న అత్తాకోడళ్లను అతి కిరాతకంగా హతమార్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జంట హత్యలతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను బీరువాను పగులగొట్టి కొల్లగొట్టారు. విషయం తెలుసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రంగంలోకి దిగి జంట హత్యలకు పాల్పడ్డ వారి వేటలో పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన మోహిన్ ఇటీవలే తబియా(25)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం తల్లి సబీహాబేగం (55), భార్య తబియాలను నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ప్రాంతానికి తీసుకువచ్చి కొత్తగా కాపురం పెట్టాడు. మోహిన్ నగరంలోని ట్రూప్‌బజార్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలోసోమవారం పనికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో తల్లి సబీహాబేగం, తబియాలు అతి కిరాతకంగా చంపబడి ఉన్నారు. ఇంట్లోని బీరువాను బద్దలుగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వెంటనే మోహిన్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలను వెలికి తీసే పనిలో పడ్డారు. అందులో భాగంగా క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను రంగంలోకి దింపి హత్య జరిగిన తీరును నిశితంగా పరిశీలించారు. తల్వార్‌తో దాడి చేశారని సంఘటన స్థలాన్ని బట్టి పోలీసులు తెలుపుతున్నారు.
ప్రేమ వివాహమే కారణమా?
జంట హత్యల కేసును పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. వివాహం జరిగిన రెండు నెలల్లోనే మోహిన్ తల్లి సబీహాబేగం, తబియాలను అతి కిరాతకంగా హత్య చేయడం పట్ల పోలీసులు పలు రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా మోహిన్‌ను సైతం విచారణకు పిలిచినట్లు సమాచారం. దీంతో పాటు మోహిన్ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు, శత్రువులు, తబియా కుటుంబీకులను సైతం విచారణ చేయనున్నట్లు సమాచారం. అత్తింటి వాళ్లే ఈ ఘటనకు పాల్పడ్డారా? లేకుంటే పాతకక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న జంట హత్యల నేపథ్యంలో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. అతి కిరాతకంగా తల్వార్‌లను ఉపయోగించి హత్య చేశారన్న విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. హత్యకు పాల్పడింది స్థానికులే అయి ఉంటారని, కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగలు అని ఇలా రకారకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.