క్రైమ్/లీగల్

టీవీ 9 రవిప్రకాశ్‌పై ఫోర్జరీ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: టీవీ 9 సీఈవో రవిప్రకాశ్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిధుల మళ్ళింపు, ఫోర్జరీ ఆరోపణలపై కేసు నమోదు చేశామని సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు. ఈమేరకు గురువారం సీసీఎస్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. టీవీ 9 యాజమాన్యం మధ్య నడుస్తున్న వివాదమే కేసు నమోదుకు కారణమని తెలిసింది. రవిప్రకాశ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందచేశామని సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు. శుక్రవారం సీసీఎస్ పోలీసుల ముందు రవిప్రకాశ్ హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా టీవీ 9 కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా 12 హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అలాగే సినీ నటుడు శివాజీకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీవీ 9ను అలంద మీడియా 90 శాతం టేకోవర్ చేసినట్లుగా సమాచారం.