క్రైమ్/లీగల్

కన్న కుమార్తెపై తండ్రి అత్యాచారయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, మే 10: కన్నతండ్రే కామాంధుడై డీగ్రీ చదువుతున్న కన్న కూతురిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఉదంతం తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా తన కోరిక తీర్చాలని రకరకాలుగా వేధిస్తున్న ఆ కామాంధుడు గురువారం రాత్రి భార్య బాత్‌రూంలో స్నానం చేస్తున్న సమయంలో ఇంట్లోనే కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలు వేసిన కేకలకు బాత్‌రూంలో ఉన్న తల్లి రావడంతో పరారయ్యాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి... కాకినాడ రూరల్ మండలం కొత్తగైగోలుపాడు దేవీనగర్‌లో ఓ కుటుంబం నివసిస్తోంది. వారి కుమార్తె ఒక కార్పొరేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. కామాంధుడిగా మారిన తండ్రి రెండేళ్లుగా ఆమెను కోరిక తీర్చమని వేధిస్తున్నాడు. కళాశాల బస్సులో కళాశాలకు వెళ్లే ఆమెను వద్దంటూ బైక్‌పై తీసుకెళ్లి, నిర్జన ప్రదేశంలో తన కోరిక తీర్చమని వేధించేవాడు. సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించేవాడు. ఈ విషయం తల్లికిగాని, ఎవరికైనాగాని చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. కాగా గురువారం రాత్రి భార్య స్నానం చేయడానికి బాత్‌రూంకు వెళ్లగా, రెచ్చిపోయిన ఆ తండ్రి కూతురిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో బాత్‌రూంలోని భార్య బయటకు రావడంతో ఆ కిరాతకుడు బయటకు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామని సర్పవరం సీఐ గోవిందరాజులు తెలిపారు.