క్రైమ్/లీగల్

ఆగస్టు 15 వరకు గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: అయోధ్యలో వివాదాస్పద స్థలం సామరస్యంగా పరిష్కరించేందుకు వీలుగా మధ్యవర్తిత్వ కమిటీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు 15వరకు గడువు ఇచ్చింది. అతి సున్నితమైన, వివాదాస్పదమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదాన్ని సామరస్యపూర్వకంగా ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకుగాను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్.ఎం.ఐ. ఖలీఫుల్లా నాయకత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీకి వెసులుబాటు కల్పించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన గల ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ జస్టిస్ ఖలీఫుల్లా కమిటీ ద్వారా అందిన నివేదికను సుదీర్ఘంగా పరిశీలించిన తర్వాత సమస్యను అందరికీ ఆమోదయోగ్యంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఈ ఏడాది ఆగస్టు 15వరకు పొడిగిస్తూ వెసులుబాటు కల్పించింది. ‘వివాదాస్పద అంశంపై ఫలితం కోసం తాపత్రయపడుతున్న మధ్యవర్తిత్వ కమిటీ ఆగస్టు 15వరకు వేచిచూస్తున్నపుడు అంతవరకు గడువు ఇస్తే నష్టమేమిటి? ఈ వివాదం కొనే్నళ్లుగా నలుగుతోంది. దీనిని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మేమెందుకు వారికి గడువు పెంచకూడదు’ అని జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో కూడిన డివిజన్ బెంచ్ వివిధ పార్టీల తరఫున హాజరైన కౌనె్సల్ ప్రతినిధులకు సూచించింది. హిందూ, ముస్లిం ప్రతినిధుల తరఫున హాజరైన కౌనె్సల్ అయోధ్య భూవివాదంపై ఏర్పడిన మధ్యవర్తిత్వ కమిటీకి ఈ విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది. మధ్యవర్తిత్వ కమిటీ చైర్మన్ ఎఫ్.ఎం.ఐ.ఖలీపుల్లా నుంచి ఈనెల 7న అందిన సమగ్ర నివేదిక ఆధారంగా సమస్యను సామరస్యపూర్వకంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఫలితం ఉండేందుకు వీలుగా గడువును ఆగస్టు 15వరకు పొడిగిస్తున్నట్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.