క్రైమ్/లీగల్

రాకేశ్‌రెడ్డిపై పీడీ యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ కేసుల నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారి శ్రీనివాసరావు తెలపారు. 2018 డిసెంబర్ 30న జయరాం హత్యకు గురైయ్యారు. జయరాం హత్యతో పాటు హైదరాబాద్‌లో గత మూడేళ్లుగా బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడడంతో రాకేశ్‌రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు.
పీడీ యాక్ట్‌కు సంబంధించి అన్ని కేసుల వివరాలను శాస్ర్తియ ఆధారాలతో ప్రతిపాదిత నివేదికలో జతపర్చామన్నారు. రాకేష్‌రెడ్డితో పాటు మరో ఏడుగురు నిందితులపై నాంపల్లి కోర్టులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. జయరాం హత్య కేసులో 70 మంది సాక్షులను విచారించిన పోలీసులు 388 పేజీల చార్జిషీట్ రూపొందించారు. ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సేకరించిన రిపోర్టును చార్జిషీట్‌కు జత చేశారు. జయరాం హత్య తర్వాత కేసులను తారుమారు చేయడానికి రాకేష్‌రెడ్డికి సహకరించిన అనుచరులు శ్రీనివాస్. సినీ నటుడు సూర్యప్రకాశ్, కిషోర్, విశాల్, నాగేశ్, అంజరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై చార్జిషీట్ దాఖలయింది.