క్రైమ్/లీగల్

రెండు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మే 10: పాదచారులపైకి కంటెనైర్ దూసుకొచ్చిన సంఘటనలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్ల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వారితో పాటు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న మరో నలుగురికి గాయపడ్డారు. స్థానిక పోలీసులు అందించిన ప్రకారం వివరాల ప్రకారం అసోం రాష్ట్రం గోల్‌గాట్ జిల్లా డేరాగావ్ , నక్కటి గ్రామానికి చెందిన ఉతపన్ పేగు (26), నాగాలాండ్ రాష్ట్రం దీనాపూర్ జిల్లా డంకన్‌స్ట్రీట్ గ్రామానికి చెందిన దామేశ్వర్ దాసు (19) మండల పరిధిలోని ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్నారు. స్థానిక పారిశ్రామికవాడలోని హిండ్‌వేర్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులను పోషించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ శివారులో శుక్రవారం జరిగిన ఘోర దుర్ఘటనలో వారు ప్రాణాలు కోల్పోయారు. సంగారెడ్డి వైపు నుండి పటాన్‌చెరు వైపు వెళుతున్న టిఎస్ 07 యుఏ 8667 నంబరు గల కంటెనైర్ లారీ ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రముఖ్‌నగర్ కాలనీకి ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న మరో కంటెనైర్‌ను రాసుకుంటూ ముందుకు వెళ్లి ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతున్న ఈ ఇద్దరిని ఢీ కొట్టింది. వీరితో పాటు మరో నలుగురికి కంటెనైర్ టక్కర్ ఇచ్చింది. ఈ సంఘటనలో ఉతపన్ పేగు, దామేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు బిస్వత్‌పెగు, బాబాగోరి, మంజన్‌పేగు, వెంకట్, టిఎస్ 07 యుఏ 8667 నంబరు గల కంటెనైర్‌లో ఉన్న గోవిందమానే తదితరులకు రక్త గాయాలయ్యాయి. గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డివైడర్ దాటి వచ్చి డీసీఎంను ఢీకొన్న కంటైనర్
జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని సత్వార్‌లో అదుపుతప్పి డివైడర్ అవతల వైపు నుంచి ఇవతలకు వచ్చిన ఒక కంటైనర్.. డీసీఎంను ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. డీసీఎం డ్రైవర్ తీవ్రగాయాల పాలయ్యాడు. మృతుల్లో ఝరాసంగం మండలం గినియార్‌పల్లికి చెందిన మోహీజ్ (38), గౌస్(55) ఉన్నారు. కంటైనర్ డ్రైవర్ పరారైనట్టు సీఐ సైదేశ్వర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం సంఘనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మృతులు హైదరాబాద్‌లో పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. షోలాపూర్ సమీపంలోని ఓ గ్రామంలో అనార్ పండ్లను కొనుగోలుచేశారు. వాటిని డీసీఎంలో లోడ్ చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. సత్వార్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ నిద్రమత్తులో ఆకస్మాత్తుగా డివైడర్‌ను ఢీకొని ఇవతిలివైపుకు వచ్చింది. ఎదురుగా వస్తున్న కారును స్వల్పంగా ఢీకొని ఎదురుగా వస్తున్న డీసీఎంను బలంగా ఢీకొంది. ఎదురెదురుగా బలంగా ఢీ కొనడంతో పండ్ల వ్యాపారులిద్దరూ వాహనంలోనే నలిగిపోయి మృతిచెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పవిత్ర రంజాన్ మాసంలో హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో రింగ్‌రోడ్ సమీపంలో మొదటి శుక్రవారం నాటి ప్రత్యేక ప్రార్థనల చేసుకుందామని ఆతృతగా వెళ్తున్నవారిని కంటైనర్ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళించడంతో ఆసుపత్రి వద్ద వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.