క్రైమ్/లీగల్

‘మెట్రో’స్టేషన్‌లో రివాల్వర్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 28: ఉప్పల్ మెట్రో రైలుస్టేషన్‌లో రివాల్వర్ కలకలం సృష్టించింది. అనుమతి లేకుండా కలిగియున్నారనే అభియోగంపై జడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి డ్రైవర్ తోట సతీష్ కుమార్‌ను పోలీసులు అరెస్టుచేసి అతనివద్ద ఎనిమిది రౌండ్ల రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జడ్పీటీసీ నారాయణరెడ్డికి ప్రభుత్వ అనుమతితో లైసెన్స్ రివాల్వర్ ఉంది. అతడు మంగళవారం సాయంత్రం తన వ్యాపార పనిపై పుణే వెళ్తుండగా తన వద్ద ఉన్న రివాల్వర్‌ను బంధువుల ఇంట్లో భద్రంగా పెట్టాలని డ్రైవర్ సతీష్‌కు ఇచ్చాడు. ఈ క్రమంలో రాత్రి కూకట్‌పల్లికి వెళ్లేందుకు ఉప్పల్‌లోని మెట్రో రైలు స్టేషన్‌కు వచ్చిన సతీష్‌ను ఇక్కడ ఉన్న భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. బయటపడిన రివాల్వర్ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని విచారించగా అసలు విషయం చెప్పాడు. నిబంధనల ప్రకారం ఒకరికి ఇచ్చిన రివాల్వర్‌ను మరొకరు కలిగియుండటం నేరమని, ఆమ్స్ యాక్ట్ కింద సతీష్‌ను అరెస్టుచేసి బుధవారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ పీ.వెంకటేశ్వర్లు తెలిపారు.