రాష్ట్రీయం

27న ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలతో పాటు అభ్యర్థుల జవాబుపత్రాల పీడీఎఫ్ ఫైళ్లను కూడా మే 27వ తేదీన అందుబాటులో ఉంచాలని రాష్ట్ర హైకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు బుధవారం రాత్రికి సిద్ధమవుతాయని, జవాబుపత్రాల పీడీఎఫ్‌లు సిద్ధం చేయడానికి మరో వారం రోజులు బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఫలితాలను మాత్రం గురువారం నాడు ప్రకటించేందుకు బోర్డు సిద్ధంగా ఉందని బోర్డు తరఫున కౌన్సిల్ పేర్కొనగా, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలతో పాటు అభ్యర్ధుల జవాబుపత్రాల పీడీఎఫ్ ఫైళ్లను కూడా ఇంటర్ బోర్డు పోర్టల్‌లో మే 27వ తేదీనాటికి అందుబాటులో ఉంచాలని హైకోర్టు పేర్కొంది. పెనుదుమారం సృష్టించిన ఇంటర్ జవాబుపత్రాల వ్యవహారంపై బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్ నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. రీ వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారం రాత్రికి పూర్తవుతుందని బోర్డు నివేదించింది. ఫలితాల ప్రాసెసింగ్ బాధ్యతను గ్లోబరీనా సంస్థ నుండి మరో సంస్థకు అప్పగించామని పేర్కొంది. ఫలితాలను ప్రకటించి, సవరించిన మార్కుల మెమోలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న బోర్డు విద్యార్థులు తమ సమాధాన పత్రాలను ఈ నెల 27 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ ధర్మాసనానికి తెలిపారు. అయితే ఫలితాలను, జవాబుపత్రాలను ఒకే రోజు వెల్లడించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఫలితాలను వెల్లడించిన తర్వాత సమాధానాలన్నింటికీ మార్కులు వేశారో లేదోనన్న అనుమానం మళ్లీ రావచ్చని పేర్కొంది. ఇప్పటికే విద్యార్థులు ఆందోళనగా ఎదురుచూస్తున్నారని , ఫలితాల వెల్లడిలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని బాలల హక్కుల సంఘం తరఫున న్యాయవాది దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు.దాంతో ఫలితాలను, జవాబుపత్రాలను ఒకే మారు విడుదల చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రీ వెరిఫికేషన్‌లో చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారని భావిస్తున్నామని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫలితాల్లో గందరగోళానికి సంబంధించిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని గ్లోబరీనా సంస్థకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు హైకోర్టు వాయిదా వేసింది.