క్రైమ్/లీగల్

నౌహీరా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: మనీ సుర్క్యులేషన్ పథకంతో రూ. 50 వేల కోట్లకుపైగా కుంభకోణానికి పాల్పడిన హైదరాబాద్ హీరా గ్రూపు అధినేత్రి నౌహీరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు(ఈడీ) గురువారం అరెస్టు చేశారు. తక్కువ డబ్బులు పెట్టుబడితో తమ స్కీమ్‌లో చేరితే ఎక్కువ చెల్లిస్తామంటూ జనాన్ని బురిడీ కొట్టించారు. వేల కోట్లను స్వాహా చేసిన నౌహీరాపై తెలంగాణ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. నౌహీరాతో పాటు హీరాగ్రూప్‌కు చెందిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు బీజు థామస్, మొల్లీ థామస్‌ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేశారు. లక్షలాది మందితో గొలుసుకుట్ట పథకం (మనీ సర్క్యులేషన్ స్కీమ్) ద్వారా నగదును డిపాజిట్ చేయించుకునేవారు. తిరిగి చెల్లించకుండా మోసం చేసిన కేసుల్లో ఆమెపై తెలంగాణ సెంట్రల్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైల్ ఉన్న నౌహీరాను కోర్టు అనుమతితో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈనెల 15 వరకు ఈడీ కస్టడీలో ఉంటారు. కస్టడీ సమయంలో హీరాగ్రూప్ బ్యాంక్ అకౌంట్ల నుంచి నౌహీరా తన సొంత అకౌంట్లలోకి నగదును మళ్లించుకున్న వ్యవహారంపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. నౌహీరాతో పాటు ఆమెకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన బీజు థామస్, మొల్లీ థామస్‌ను విచారించనున్నారు. హీరాగ్రూప్‌లో పెట్టబడులు పెట్టిన మదుపరులకు 36 శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికినట్టు కేసు నమోదు చేశారు. ఎక్కువ శాతం వడ్డీ వస్తుందని బంగారు వ్యాపారులు మోసపోయారు. దేశ వ్యాప్తంగా 1, 72, 114 మంది పెట్టబడులు పెట్టారని ఈడీ గుర్తించింది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా హీరాగ్రూప్ సంస్థను నడిపించారని ఈడీ పేర్కొంది. హీరాగ్రూప్‌లో తెలంగాణ, ఆంధ్ర, కేరళ, ఢిల్లీ, గల్ఫ్‌దేశాలు ఉన్నాయని ఈడీ విచారణలో తేలింది. హీరాగ్రూపులకు అనుబంధంగా మరో 24 బినామీ కంపెనీలను నౌహీరా ఏర్పాటు చేసినట్లు విచారణ వెల్లడయింది. హీరాగ్రూపు పేరు మీద దాదాపు 182 బ్యాంక్ అకౌంట్లు ఏర్పాటు చేసింది. సౌదీ అరేబియా, యూఏఈలో 10 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నౌహీరా గ్రూపుకు సాఫ్ట్‌వేర్‌ను బీజు థామస్ ఏర్పాటు చేశారు. మొల్లీ థామస్ నౌహీరాకు పీఏగా పని చేశారు. నౌహీరా గ్రూపుకు చెందిన బ్యాంక్ ఖాతాలను ఇప్పటికే స్తంభింపజేశారు.