క్రైమ్/లీగల్

బాధితురాలి సాక్ష్యమే విశ్వసించాలని లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రోని థానే జిల్లాలో జరిగిన ఓ రేప్‌కేసులో బాంబే హైకోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి రేపిస్టుకు విధించిన శిక్షను హైకోర్టు కొట్టివేసింది. అలాగే అత్యాచార బాధితురాలి సాక్ష్యం అన్ని వేళలా విశ్వసనీయమైందని చెప్పలేమని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆమె సాక్ష్యానే్న ఆధారం చేసుకుని తీర్పును ఇవ్వడం సరైందికాదని 19 ఏళ్ల యువకుడికి విధించిన శిక్షను కొట్టివేసింది. బాంబే హైకోర్టులో న్యాయమూర్తి రేవతి మొహితే డేరే నేతృత్వంలోని సింగిల్ బెంచ్ కేసును విచారించింది. బాధితురాలి సాక్ష్యానే్న పరిగణలోకి తీసుకుని అన్నివేళలా తీర్పులు ఇవ్వడం సరైందికాదని న్యాయమూర్తి అన్నారు. మహారాష్టల్రోని థానే జిల్లాకు చెందిన సునీల్ షెల్కే తనపై కింది కోర్టు విధించిన శిక్షను హైకోర్టులో సవాల్ చేశాడు. యువతిపై అత్యాచారం నేరంపై అతడికి కింది కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రేప్ ఘటన 2009 మార్చిలో జరిగింది. గ్రామంలో అందరూ హోలీ పండుగ చేసుకుంటుండగా షెల్కే, అతడి ఇద్దరు స్నేహితులు తనను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కేళ్ళారని బాధితురాలు ఆరోపించింది. అక్కడ షెల్కే తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది. మర్నాడు ఉదయం ఇంటికి వచ్చిన ఆమె రేప్ విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. నెల రోజుల తరువాత దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా సంఘటనకు ముందే షెల్కే, బాధితురాలికి పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. అయితే వివిధ కారణాల వల్ల పెళ్లి జరగలేదని దీంతో ఆమె, ఆమె కుటుంబీకులు తనను రేప్ కేసులో ఇరికించారని అతడు కోర్టుకు తెలిపాడు. బాధితురాలి సాక్ష్యం ఆధారంగా కింది కోర్టు అతడిని దోషిగా నిర్ధారించడం, ఏడేళ్లు శిక్ష విధించడం జరిగింది. కింది కోర్టు తీర్పును సునీల్ షెల్కే హైకోర్టులో సవాల్ చేశాడు. కాగా ఆ రోజు ఏం జరిగిందీ బాధితురాలు స్పష్టంగా చెప్పడం లేదని, మెడికల్ రిపోర్ట్‌లు కూడా ఆమెపై ఎక్కడా గాయలైనట్టు నిర్ధారించలేదని బెంచ్ స్పష్టం చేసింది. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంపై కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ‘బాధితురాలి సాక్ష్యానే్న విశ్వసించాలని లేదు. సంఘటనకు ముందే పెళ్లయిందనిన చెబుతోంది’అని న్యాయమూర్తి అన్నారు. ఆమె సాక్ష్యానే్న ఆధారంగా తీసుకుని శిక్షను ఖరారు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కింది కోర్టు తీర్పును నిలిపివేసింది.