క్రైమ్/లీగల్

వాట్సప్‌లో ట్రిపుల్ తలాఖ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థానె, మే 16: ట్రిపుల్ తలాఖ్ చెల్లదని, రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా థానెకు చెందిన ఓ వ్యక్తి వాట్సప్‌లో తన భార్యకు తలాఖ్ చెప్పడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. కల్యాణ్ టౌన్‌కు చెందిన 28 ఏళ్ల నదీమ్ షేక్‌తో 2014 మే 18న వివాహం జరిగిందని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లయిన అత్తమామలు, భర్త తనను ఎంతో వేధించారని, 5 లక్షల నగదు తీసుకురమ్మని తరచూ వేధించడంతో పాటు దాడి కూడా చేశారని పోలీసులకు తెలిపింది. అనంతరం తనను ఇంటినుంచి గెంటివేయడంతో భివాండిలోని బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నానని పేర్కొంది. మార్చి 12న వాట్సప్‌లో నదీమ్ షేక్ తలాఖ్ మెసేజ్ పంపించాడనీ, ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పందించలేదని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు నదీమ్ షేక్, అతని తల్లిదండ్రులపై ఐపీసీ 498-ఏ, 323, 504 సెక్షన్లతో పాటు ముస్లిం మహిళల వివాహ హక్కు చట్టం కింద కేసులు నమోదు చేశామని థానె పోలీసులు గురువారం వెల్లడించారు. కాగా, ట్రిపుల్ తలాఖ్ చెల్లదని, రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టులో అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన విషయం విదితమే.