క్రైమ్/లీగల్

తలాఖ్ పిటిషన్‌పై నేడు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: రెండుసార్లు తలాఖ్ నోటీసులు పంపిన తన భర్తపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించనున్నట్లు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్‌ఖన్నాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వివాహం జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత పిటిషనర్‌కు ఆమె భర్త మార్చి, మే నెలల్లో రెండుసార్లు తలాఖ్ నోటీసులు పంపించాడని బాధిత మహిళ తరపు న్యాయవాది ఎం.ఎం.కాశ్యప్ కోర్టుకు తెలిపారు. 2009 ఫిబ్రవరి 22వ తేదీన ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగిందని, ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. దీనికి స్పందించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. తలాఖ్ చట్టవిరుద్ధమని, చెల్లదని 2017లో ఈ అత్యున్నత న్యాయస్థానమే తీర్పు చెప్పిందని, ఆ మేరకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు బదులిచ్చారు. దీంతో శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అదనపు కట్నంతోపాటు కారు కూడా కావాలంటూ తన అత్తమామలు, భర్త వేధించడంతో పాటు హింసించారని కూడా బాధిత మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది. తన భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీచేయాలని ఆమె ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది.