క్రైమ్/లీగల్

* రూ. 60 లక్షల బీటీ-3 పత్తి విత్తనాల సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, మార్చి 29: నంద్యాల పట్టణ శివారులో ఉన్న బబ్బూరి, వెంకటేశ్వర సీడ్ కంపెనీలపై గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు విత్తన కంపెనీల్లో రూ.60 లక్షల బీటీ-3 పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ సీఐ జగన్మోహన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వర్లు తెలిపారు. నంద్యాల డివిజన్‌లో నిషేదిత బీటీ-3 పత్తి సాగు చేస్తున్న విషయాన్ని ఆంధ్రభూమి ప్రధాన సంచికలో ఈ నెల 19, 20, 21వ తేదీల్లో 34పత్తిపై బీటీ-3 కత్తి22 అన్న శీర్షికతో వరుస కథనాలు వచ్చిన విషయం విధితమే. ఆంధ్రభూమి ప్రధాన సంచికలో నిషేదిత బీటీ-3పై వచ్చిన కథనాలకు స్పందించి విజిలెన్స్ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు నంద్యాల పట్టణంలో గుట్టుగా సమాచారం సేకరించి గురువారం దాడులు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు సీడు కంపెనీల్లో నిర్వహించిన దాడుల్లో వెంకటేశ్వర సీడ్ కంపెనీలో 81 సంచులలోని బీటీ-3 విత్తనాలు సీజ్ చేశామని, అలాగే బబ్బూరి సీడ్స్‌లో రూ.18 లక్షల విలువ గల బీటీ-3 పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. విజిలెన్స్ దాడుల్లో ఎస్‌ఐ జయన్న, హెడ్‌కానిస్టేబుల్ నరేష్, పీసీ నాగభూషణం, స్థానిక వ్యవసాయాధికారులు జయప్రకాష్, ఆయూబ్‌బాషలు పాల్గొన్నట్లు వారు తెలిపారు. ఈ రెండు సీడ్ కంపెనీల్లో నిర్వహించిన దాడుల్లో నిషేదించిన బీటీ-3 విత్తనాలను స్ట్రిప్ టెస్టు ద్వారా ప్రాథమికంగా గుర్తించామని, వీటి శాంపిల్స్‌ను గుంటూరులోని బయోటెక్నాలజి ల్యాబ్‌కు పంపి అక్కడ కూడా పరీక్షించిన అనంతరం సీడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు.