క్రైమ్/లీగల్

గుప్తనిధుల కోసం వెళ్లి మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్లుపాడు, మే 16: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లి అటవీప్రాంతంలో గుప్తనిధులు ఉన్నాయని ముగ్గురు వేటగాళ్ళు అడవిలోనికి ప్రవేశించి వేసవి తాకిడికి దాహార్తిని తీర్చుకునేందుకు విడిపోయి ఒకరు మృతి చెందగా మరొకరు తప్పిపోగా, ఇంకొకరు జాతీయరహదారికి చేరుకొని జరిగిన సంఘటన పోలీసుల దృష్టికి తీసుకువచ్చిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం మేరకు గుంటూరు జిల్లా తెనాలి మండలం మున్నంగి గ్రామానికి చెందిన కృష్ణానాయక్‌కు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లి అటవీప్రాంతంలో గుప్తనిధులు ఉన్నాయని సమాచారం అందింది. దీనితో కృష్ణానాయక్ ఆ సమాచారాన్ని తన స్నేహితులైన అదే గ్రామానికి చెందిన హనుమంతనాయక్, హైదరాబాద్‌లో కెనరాబ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్న కట్టా శివకుమార్‌కు చేరవేశాడు. కాగా ముగ్గురు స్నేహితులు ఆదివారం గుంటూరులో సమావేశమై రైలు మార్గం ద్వారా తర్లుపాడుకు చేరుకున్నారు. తాడివారిపల్లి వెలుగొండ అటవీప్రాంతంలో మలప్పచలలో నందనవనం ఏరియాలో పాతశివాలయం, కొలను ఉన్నాయని, వాటికి ఎదురుగా పాండురంగస్వామి దేవాలయం ఉన్నాయని, ఈ ప్రాంతంలో కాటంరాజు తిరిగారని ప్రసిద్ధి చెందింది. ఈప్రాంతంలో గుప్తనిధులు ఉన్నట్లుగా గుర్తించిన వారు ఆదివారం రాత్రికి తాడివారిపల్లి అటవీప్రాంతం వద్దకు చేరుకొని మార్గమధ్యలో తినేందుకు, తాగేందుకు వీలుగా వాటర్ బాటిళ్ళు, చిరుతిళ్ళు, మజ్జిగప్యాకెట్లు తీసుకువెళ్ళారు. ఆదివారం రాత్రి సజావుగా సాగిన వారి ప్రయాణం మరుసటిరోజు ఉదయానికి అటవీప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్ల మేర ప్రయాణించిన ముగ్గురు మిత్రులు తమ వెంట తెచ్చుకున్న నీరు, మజ్జిగ ప్యాకెట్లు అయిపోవడంతో నీటి కోసం వెతుకులాట ప్రారంభించారు. దట్టమైన అటవీప్రాంతం కావడంతో నీటి కోసం వెతుకులాటలో ముగ్గురు విడిపోయారు. ఎవరికీ కనుచూపుమేర ఎటువంటి గ్రామాలు కానరాకపోవడంతో ఎవరి దప్పిక వారు తీర్చుకునేందుకు వారు అడవిలో నీటి కోసం వెతుకుంటూ హనుమంతనాయక్, శివకుమార్ అడవిలోనే మిగిలిపోగా కృష్ణానాయక్ మాత్రం రోడ్డు మార్గం కనిపించడంతో రోడ్డుపైకి చేరుకొని దప్పిక తీర్చుకొని చిన్నగా కంభం చేరుకొని , కంభం రైల్వేస్టేషన్‌లో బ్యాగ్‌ను బాత్‌రూమ్‌లో పెట్టి సోమిదేవుపల్లి శివాలయానికి చేరుకొని సేద తీరి రెండురోజులపాటు మిత్రుల కోసం ఎదురుచూశారు. కాగా శివకుమార్ కుమారుడు తన తండ్రి ఫోన్ పని చేయకపోవడంతో కృష్ణానాయక్‌కు ఫోన్ చేసి మా నాన్న మీ వెంటే వచ్చారు కదా ఫోన్ పని చేయడంలేదు అని అడుగగా మేము అందరం గుప్తనిధుల కోసం అడవిలోనికి వెళ్ళామని, అక్కడ ముగ్గురం విడిపోయామని, వారి కోసం రెండు రోజులుగా వెతుకున్నానని సమాధానం చెప్పాడు. బుధవారం సాయంత్రం తాడివారిపల్లి పోలీసులకు కృష్ణానాయక్ జరిగిన విషయాన్ని తెలియచేయడంతో మర్రిపూడి, పొదిలి, దొనకొండ ఎస్సైలు అటవీశాఖ అధికారుల సహాయంతో వెతుకులాట ప్రారంభించారు. మార్గమధ్యలో శివకుమార్ మృతదేహాన్ని గుర్తించారు. హనుమంతనాయక్ కోసం గాలింపుచర్యలు చేపట్టినప్పటికీ గురువారం సాయంత్రం వరకు ఎక్కడా జాడ దొరకకపోవడంతో వెతుకులాటను తీవ్రతరం చేస్తున్నట్లు పొదిలి సిఐ చిన్నమీరాసాహెబ్ పేర్కొన్నారు. శివకుమార్ మృతదేహాన్ని అటవీప్రాంతం నుంచి రోడ్డుమార్గానికి చేర్చి పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. మర్రిపూడి, దొనకొండ, పొదిలి ఎస్సైలు కె మాధవరావు, రమేష్, టి శ్రీరామ్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ నాగరాజు, ఎఫ్‌ఆర్‌ఓ నాగేంద్ర, ఎఫ్‌బిఓ ప్రభాకర్, ఒంగోలు స్పెషల్ పార్టీ పోలీసులు ఎండను సైతం లెక్కచేయక అటవీప్రాంతంలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కృష్ణానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ చిన్నమీరాసాహెబ్ తెలిపారు. గురువారం రాత్రి సైతం గాలింపు చర్యలు ఉంటాయని, త్వరలోనే హనుమంతనాయక్‌ను గుర్తించడం జరుగుతుందని, కృష్ణానాయక్‌ను విచారణ నిమిత్తం అదుపులోనికి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.