క్రైమ్/లీగల్

ఇంటి వివాదంలో కొడుకు చేతిలో తండ్రి హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండ్రుగొండ, మార్చి 29: చిన్నపాటి వివాదానికి ఆవేశానికి లోనై కన్నతండ్రినే కడతేర్చిన సంఘటన మండలంలోని తుంగారం శివారు సుంకరబంజర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాదావత్ బాలాజీ (50) చిన్న కుమారుడు సురేష్ దాడిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. బాలాజీ భార్య ఆరు సంవత్సరాలక్రితం మృతి చెందటంతో బాలాజీ ఒంటరిగా జీవిస్తున్నాడు, ఇద్దరు కొడుకులున్నా పలుప్రాంతాలలో విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు చేస్తూ నెలలో ఐదారు రోజులు మాత్రమే గ్రామంలో నివసిస్తాడని గ్రాస్తులు తెలిపారు. తనకంట్టూ నివాసం ఉండాలని భావించిన బాలాజీ చిన్న కుమారుడు సురేష్ ఇల్లు ముందుభాగంలో రేకులతో చిన్నపాటి ఇంటిని నిర్మిస్తున్నాడు. అదేవిధంగా సురేష్ సైతం తన ఇంటి చుట్టూ మట్టిపోస్తున్నాడు. మట్టి తరలింపునకు తండ్రి ఇంటి నిర్మాణానికి అమర్చిన కర్రలు అడ్డుగావున్నాయని తండ్రి బాలాజీతో గత రెండు రోజులుగా సురేష్ ఘర్షణ పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తండ్రి కొడుకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. వివాదంలో కోపోద్రిక్తుడైన సురేష్ తండ్రి మెడపై కర్రతో బలంగా కొట్టాడు. ఈదాడిలో బాలాజీ తల, మెడపై బలమైన గాయాలవటంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కుమారుడు రవి ఫిర్యాదు మేరకు జూలూరుపాడు సిఐ రాయల వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్‌ఐ ప్రసాద్ గ్రామంలోని సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.