క్రైమ్/లీగల్

విద్యుదాఘాతానికి తల్లీకూతురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, మే 16: ఇంట్లో బట్టలు ఆరేస్తూ తల్లీకూతురు విద్యాదాఘాతానికి గురై దుర్మరణం పాలైన సంఘటన బాలాపూర్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బాలాపూర్‌లోని షాహిన్ నగర్ ప్రాంతంలో ఘటన జరిగింది. సల్లా బేగం తన ఇంట్లో ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు బట్టలు ఆరేస్తుంది. ఇనుప వైరుకు కరెంట్ స్తంభం నుంచి ఇంటి లోపలికి వస్తున్న సర్వీస్ వైర్ నుంచి విద్యుత్ ప్రవహించడంతో సల్మా బేగం (34), కూతురు సానియా(9) ఇద్దరు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరు సంరీన్ (13), మస్కాన్ (11)ను స్థానికులు రక్షించి సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. సమాచారం అందుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్ర రెడ్డి.. ఘటన స్థలాన్ని సందర్శించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించింది. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు.