క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మే 17: ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్ పురపాలక సంఘం కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శేఖర్ రెడ్డి.. ఇంటి పన్ను విషయంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కినట్లు వివరించారు. షాద్‌నగర్ పట్టణానికి చెందిన నరేందర్ అనే వ్యక్తి చటాన్‌పల్లి గ్రామ సమీపంలో ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంటికి సంబంధించిన పెండింగ్ పన్నులను చెల్లించేందుకు పురపాలక సంఘం కార్యాలయానికి వస్తే సంబంధిత అధికారులు తీసుకోకపోవడమే కాకుండా పదివేలు లంచం అడిగినట్లు, దాంతో బాధితుడు తమ వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకున్నట్లు వివరించారు. బాధితుడి ఫిర్యాదుతో విచారణ చేయగా అసలు విషయం బయటకు వచ్చిందని, శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో బాధితుడి నుండి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వివరించారు. అవినీతి అధికారి శేఖర్ రెడ్డిని నుంచి రూ.10వేలు రికవరీ చేయడంతోపాటు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఎక్కడ లంచం అడిగినా తమ దృష్టికి తీసుకువస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.