క్రైమ్/లీగల్

నల్లమల అడవిలో మరో మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్లుపాడు, మే 17: గుప్తనిధుల వేటలో అడవిలోకి వెళ్ళి ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతైన సంఘటనలో రెండవ వ్యక్తి అయిన హనుమంతనాయక్ మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. గుప్తనిధుల వేటలో భాగంగా ముగ్గురు మిత్రులు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లి సమీపంలోగల అటవీప్రాంతంలోకి ఆదివారం రాత్రి ప్రవేశించారు. ఎండలు మండుతూ దాహం వేస్తుండటంతో నీటిని వెతుక్కుంటూ ముగ్గురు మిత్రులు మూడు దిక్కులకు వెళ్ళగా వారిలో ఒకరు జాతీయరహదారికి చేరుకోగా మరో మిత్రుడు శివకుమార్ మృతి చెందాడు. ఇంకో మిత్రుడు హనుమంతనాయక్ అటవీప్రాంతంలోనే గల్లంతు కాగా పోలీసులు, అటవీశాఖ అధికారులు హనుమంతనాయక్ ఆచూకీ కోసం గురువారం అంతా అటవీప్రాంతంలో గాలించారు. చీకటి పడినప్పటికీ హనుమంతనాయక్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తిరిగి శుక్రవారం ఉదయం అధికారులు మూడు బృందాలుగా విడిపోయి అటవీప్రాంతంలో గాలింపుచర్యలు చేపట్టారు. కాగా, శివకుమార్ మృతదేహం దొరికిన ప్రాంతానికి మూడుకిలోమీటర్ల దూరంలో హనుమంతనాయక్ మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా అటవీప్రాంతంలో గుప్తనిధుల వేటకు వచ్చి ఇద్దరు మృతిచెందడంతో పశ్చిమప్రకాశం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. మృతి చెందిన శివకుమార్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో కెనరాబ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుండగా, హనుమంతనాయక్ గుంటూరు జిల్లా మున్నంగి గ్రామంలో వడ్రంగిగా పనిచేస్తున్నాడు.