క్రైమ్/లీగల్

ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటాన్‌చెరు, మే 17: బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పటాన్‌చెరు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి న్యాయస్థానానికి తరలించారు. పాస్‌పోర్టు లేకుండా భారతదేశంలోకి చొరబాటుకు పాల్పడ్డారనే నేరంపై వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. గత ఏడు సంవత్సరాలుగా స్థానికంగా నివాసం ఉంటున్న వారు చివరికి శుక్రవారం స్థానిక పోలీసులకు చిక్కారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఐ నరేష్ వివరాలను వెల్లడించారు. భారతదేశం సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు మహమ్మద్ బాబు (22), మహమ్మద్ రిపేన్ (25), గులామ్ హుస్సేన్ (40), సైఫూల్ ఇస్లామ్ (24), మహమ్మద్ సైదుల్ ఖురేషి (29) తదితరులు 2012లో ఇండియాలోకి ప్రవేశించారు. మహమ్మద్ బాబు బంగ్లాదేశ్‌లోని గోడల్ల గ్రామం ఆసాశన్ని థానా సత్కిరా జిల్లాకు చెందిన వాడు కాగా మహమ్మద్ రపేన్ బద్వస్తరా గ్రామం బానాపూర్ పోర్ట్ జెస్సూర్ జిల్లా వ్యక్తిగా గుర్తించారు. బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లా శోక్ష థానా కిస్మత్‌పురా గ్రామానికి చెందిన గులామ్ హుస్సేన్, ఇక సైఫూల్ ఇస్లామ్ అదే దేశంలోన బోడా అస్సాడా గ్రామానికి చెందిన వాడు. సైదుల్ ఖురేషి జెస్సోర్ జిల్లా జిగర్ గచ్చా తాలా పరిధిలోని క్రిష్ణనగర్‌కు చెందిన వ్యక్తి. పాస్‌పోర్టు లేకుండా సంబంధిత అధికారుల అనుమతి లేకుండా దొంగతనంగా ఈ ఐదుగురు యువకులు మన దేశంలోకి ప్రవేశించారని పోలీసులు తెలియచేస్తున్నారు. వీరు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆల్‌కబీర్ పశువధశాలలో వీరంతా కార్మికులుగా పని చేస్తున్నారు. పశువధశాల పక్కన గల ఇప్పలగడ్డ తండాలో నివాసం ఉంటున్నారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన సలీమ్, ఇస్లామ్ అనే ఇద్దరు వ్యక్తుల ద్వార ఈ ఐదుగురు మన దేశంలోకి ప్రవేశించినట్టు పోలీసులు కనుగొన్నారు. ఆల్‌కబీర్ పశువధశాలలో గతంలో ప్యాకింగ్ సెక్షన్ కాంట్రాక్టరులుగా పనిచేసిన సలీమ్, ఇస్లామ్ పరిశ్రమకు చెందిన అధికారులతో తమకు ఉన్న పరిచయం ద్వారా వారిని కార్మికులుగా చేర్పించారు. ఆల్‌కబీర్ పరిశ్రమ నుంచి పశువుల మాంసం బంగ్లాదేశ్‌కు సైతం ఎగుమతి అవుతోంది. అదే క్రమంలో అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన ఐదుగురికి ఇక్కడికి రావాలనే ఆలోచన తట్టింది. బతుకుదెరువు కోసం ఇండియాలోకి వారు అక్రమంగా వచ్చారని పోలీసుల విచారణలో తేలింది. అసోం రాష్ట్రానికి చెందిన ఇద్దరు పిల్లలు ఉన్న విధవరాలిని మహమ్మద్ బాబు పెళ్లి చేసుకోగా అదే రాష్ట్రానికి చెందిన అమ్మాయిని మహమ్మద్ రపేన్ వివాహమాడాడు. మహారాష్టక్రు చెందిన అమ్మాయిని మహమ్మద్ సైదుల్ ఖురేషి పెళ్లి చేసుకోగా మరో ఇద్దరు యువకులకు ఇంకా పెళ్లి కాలేదు. పాస్‌పోర్టు లేకుండా మన దేశంలోని చొరబడిన వీరందరూ ఇక్కడి అడ్రస్‌లతో ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు సంపాదించారు. పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన వారి అడ్రస్‌పై వారికి కార్డులు లభించాయి. ఈ క్రమంలో పోలీసులు గత పది రోజులుగా గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నారు.

చిత్రం...అక్రమ వలసదారులను విలేఖరులకు చూపుతున్న పోలీసులు