క్రైమ్/లీగల్

కల్వర్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, మే 17: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఎదురుగా 63వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టి బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల నుంచి చెన్నూర్ వైపు వెళుతున్న మంచిర్యాల ఆర్టీసీ డిపో టి ఎస్ 19టి4878 ఆర్టిసి బస్సు అదుపుతప్పి జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన కల్వర్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 70మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ ప్రేంసాగర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో బస్ కండక్టర్ ఆశన్న (54) కుంటాలపూర్ గ్రామానికి చెందినవాడు. బీమారం మండలానికి చెందిన మల్యాల లక్ష్మి, నేరేళ్ల లచ్చన్న, లక్ష్మి, గౌరక్క (58), అనే్వష్ (24), నిర్మల్ జిల్లా కడెంకు చెందిన సాలక్క, రజిత(25), నెనె్నలకు చెందిన రాజం, కిష్టయ్య, చెన్నూర్ మండలానికి చెందిన కమల, రంజన్ అలీ, ఫాతేమహ్మద్ నూరున్నిసా, అజీమ్, కోటపల్లి మండలం ఆల్గామకు చెందిన మనోహర్ (38), దుర్గం సమ్మయ్య(40), మహారాష్టల్రోని సిరొంచకు చెందిన దుర్గం గట్టు, తిరుమల (35)లకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి శ్రీరాంపూర్ సీఐ నారాయణ నాయక్, సిబ్బంది నిజామత్‌లు చేరుకొని అత్యవసర చికిత్స నిమిత్తం దగ్గరలోని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ ఆశన్న, మహారాష్టక్రు చెందిన దుర్గం గట్టు పరిస్థితి విషమంగా ఉందని ఏఎస్సై గంగరాజం తెలిపారు.