క్రైమ్/లీగల్

పాస్‌పుస్తకం రాలేదన్న బెంగతో.. కామారెడ్డి జిల్లాలో తనువు చలించిన రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, మే 17: రైతు బంధు చెక్కు రాకపోవడంతో పాటు నూతన పాస్ పుస్తకం కోసం ఎన్నోసార్లు తహశీల్దార్ కార్యాలయానికి తిరిగినా ఫలితం లేకపోవడంతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రాంలక్ష్మణ్ పల్లి గ్రామానికి చెందిన సాకలి కిష్టయ్య అనే రైతు మృతి చెందాడు. కిష్టయ్యకు గ్రామ శివారులోని 137 సర్వే నెంబరులో ఎకరం భూమి ఉంది. గతంలో ప్రభుత్వం చేపట్టిన రికార్డుల ప్రక్షాళనలో కిష్టయ్యకు నూతన పాస్ పుస్తకం రాలేదు. దీంతో పాటు రైతుబంధు చెక్కులు సైతం రాకపోవడంతో వీటి కోసం అనేక సార్లు గాంధారి తహశీల్దార్ కార్యాలయానికి తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత కొన్ని రోజుల నుండి కిష్టయ్య్ట మదనపడుతూ ఉన్నాడు. చివరకు శుక్రవారం ఉదయం ఇంట్లో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని, కిష్టయ్య కుటుంబానికి న్యాయం జరగాలంటే మృతదేహాన్ని గాంధారి తహశీల్దార్ కార్యాలయం ముందు ఉంచి ఆందోళన చేస్తామని గ్రామస్థులు నిర్ణయించారు. సమాచారం అందుకున్న గాంధారి ఎస్‌ఐ సత్యనారాయణ సిబ్బందితో కలసి రాంలక్ష్మణ్ పల్లి గ్రామానికి చేరుకున్నాడు. అప్పటికే కిష్టయ్య మృతదేహాన్ని ట్రాక్టర్‌లో గాంధారికి తరలించే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయన గాంధారి రెవెన్యూ అధికారుల మీద దాడికి గ్రామస్థులు యత్నించారు. కిష్టయ్య మృతదేహాన్ని ట్రాక్టర్‌లో వేసుకుని గుర్జాల్ గ్రామ సమీపంలోకి రాగానే పోలీసులు మరోమారు వారిని అడ్డుకున్నారు. అక్కడికి ఎల్లారెడ్డి ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, డీఎస్పీ సత్తెన్న చేరుకున్నారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. కిష్టయ్యకు పాసు పుస్తకం రాకపోవడానికి ఈకేవైఎస్‌లో సాంకేతిక లోపం అని, అలాగే అతని వేలిముద్రలు రాకపోవడంతో పాస్ పుస్తకం రాలేదన్నారు. సాంకేతిక కారణాల మూలంగానే కిష్టయ్యకు పాస్ పుస్తకం రాలేదని, ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని ఆర్డీఓ గ్రామస్థులను కోరారు. అనంతరం మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున 20 వేల రూపాయలతో పాటు పిల్లలను హాస్టళ్లలో చదివించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ మృతుని కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు వెనుతిరిగారు.