క్రైమ్/లీగల్

వారానికోసారి హాజరుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి, మే 17: ‘వారానికో రోజు మా మాముందు హాజరుకావాలి’ అని మాలేగాం పేలుడు ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఏడుగురు నిందితుల్లో భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్ట్‌నెంట్ కర్నల్ ప్రసాద్ కూడా ఉన్నారు. నిందితుడు తరచూ విచారణ సమయంలో హాజరుకాకపోవడాన్ని ఎన్‌ఐఎ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ పడాల్కర్ తప్పుపట్టారు. దీంతో వారంలో ఒక రోజు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం కోర్టు నాటి ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నదని, సాక్షులను విచారిస్తున్నదని తెలిపారు. కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసులో ప్రజ్ఞా సింగ్, లెఫ్టెనెంట్ కర్నల్ ప్రసాద్, పురోహిత్, ఠాకూర్, రమేష్ ఉపాధ్యాయ, అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేదీ, చతుర్వేది, కులకర్ణి నిందితులుగా ఉన్నారు. కాగా ప్రస్తుతం వారు బెయిల్‌పై ఉన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు, క్రిమినల్ కుట్ర, ఇంకా హత్య ఆరోపణలపై కోర్టులో విచారణ జరుగుతున్నది. ఉత్తర మహారాష్టల్రోని 200 కిమీ దూరంలోని మాలెగాంలో ఒక మసీదు వద్ద 2008 సంవత్సరం సెప్టెంబర్ 29న మోటార్ సైకిల్‌కు ఉన్న బాంబు పేలిన ఘటనలో ఆరుగురు మరణించగా, వంద మంది వరకు గాయపడిన సంగతి తెలిసిందే.