క్రైమ్/లీగల్

మైనర్లపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, మే 18: రాజస్తాన్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. అల్వార్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు నిందితుల ఇళ్లపై దాడులు చేశారు. ఆ దాడిలో ఓ నిందితుడు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. హస్రా గ్రామంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్టు సదర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని, నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. చురులోని భనిపురా ప్రాంతంలోని ఓ ఆరేళ్ల బాలికపై ఆమె కుటుంబ సభ్యులే అత్యాచారం జరిపారు. నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఈ సంఘటనలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.