క్రైమ్/లీగల్

తెలంగాణ సీఎం సంతకం ఫోర్జరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నకిలీ లెటర్‌హెడ్ తయారు చేయడమేగాక, ఏకంగా ముఖ్యమంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి 100 కోట్ల విలువైన భూమిని హస్తగతం చేసుకునేందుకు చేసిన యత్నాన్ని అధికారులు, పోలీసులు భగ్నం చేశారు. అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న రెండు ఎకరాల స్థలం కోసం సీఎం సిఫార్సు చేసినట్లు నకిలీ పత్రాలతో అధికారులను మోసం చేయాలని కొందరు ప్రయత్నించారు. రాజేంద్రనగర్ ఆర్‌డీఓకు అనుమానం వచ్చి సిఫార్సు లేఖపై విచారణ చేయమని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఫోర్జరీ ముఠాకు సంబంధించి గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం- పాతబస్తీకి చెందిన మహమ్మద్ ఉస్మాన్ ఖురేషీ సయ్యద్ రషీద్ హుసేన్ గోల్కొండ నివాసి రఫీయా బేగంకు చెందిన గచ్చిబౌలి సర్వే నెంబర్ 44పీలో ఉన్న రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. వాటితో భూమిని హస్తగతం చేసుకునేందుకు పథకం వేశారు. అందులో భాగంగానే సయ్యద్ రషీద్ తన స్నేహితుడైన నిజామాబాద్‌కు చెందిన బాబాఖాన్ సాయంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) లెటర్ హెడ్ తయారు చేసి, సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసి సదరు పత్రాలను 60 వేలకు అమ్మారు. ఖురేషీ నకిలీ పత్రాలపై ముసారాంబాగ్‌కు చెందిన అమరేందర్‌ను కలిసి, ముఖ్యమంత్రి సిఫార్సు చేసినట్లు లెటర్ హెడ్ చూపారు. గచ్చిబౌలి సర్వే నెంబర్ 44పీలో రెండు ఎకరాల రెండు గుంటల భూమి కొనుగోలు చేశామని దానిని మ్యుటేషన్ చేయవలసిందిగా టైపు చేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు దరాఖాస్తు చేసుకున్నారు. సదరు సిఫార్సు లెటరు కలెక్టరు ఆఫీసు నుండి రాజేంద్రనగర్ ఆర్‌డీఓ కార్యాలయానికి వచ్చింది. సిఫార్సు లెటరు పరిశీలించిన ఆర్‌డీఓకు అనుమానం రావడంతో విచారణ చేయాలని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నాలుగురు సభ్యుల ముఠాలో మహమ్మద్ ఉస్మాన్ ఖురేషీ (50) సయ్యద్ రషీద్ ఉసేన్ (37) అమరేందర్ (40) అరెస్టు చేయగా బాబాఖాన్ పరారీలో ఉన్నారు. సయ్యద్ రషీద్ ఉసేన్ ముగల్‌పూరా డివిజన్ టీఆర్‌ఎస్ నాయకుడు కావడం గమనర్హం. పరారీలో ఉన్న బాబాఖాన్ దొరికితే మరిన్ని నకిలీ ధ్రువపత్రాలు లభించవచ్చని డీసీపీ అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల నుండి నాలుగు మొబైల్ ఫోన్లతో పాటు సీఎం సంతకాన్ని ఫోర్జరీ చేసిన నకిలీ లెటర్ హెడ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ముఠా రెవెన్యూ, వాటర్ వర్క్స్, మెట్రో రైలు వంటి పలు డిపార్ట్‌మెంట్లలకు సీఎం సంతకం ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్‌లను ఉపయోగించి అనేక మోసాలు చేసేందుకు ప్రయత్నించిందని చెప్పారు. ఫోర్జరీ ముఠాను అరెస్టు చేసిన మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావుని, రాయదుర్గం సీఐ రవిందర్, మురళిధర్, అవినాష్ రెడ్డితో పాటు సిబ్బందిని అభినందించారు.

చిత్రం...అరెస్టయిన నిందితులు