క్రైమ్/లీగల్

తృటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, మే 18: అదుపు తప్పి డీసీఎం వ్యాన్ బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారు ఝామున నందిగామ మండలం బైపాస్ రోడ్డుపై ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రైతులకు సంబంధించిన మామిడి కాయల లోడుతో కడప నుంచి మహారాష్టల్రోని నాందేడ్‌కు వెళ్తుండగా శనివారం తెల్లవారు ఝామున నందిగామ బైపాస్ రోడ్డుపై అదుపు తప్పి డీసీఎం వ్యాన్ బోల్తా పడటంతో ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. డీసీఎంలో ప్రయాణిస్తున్న ముఖీత్‌ఖాన్, గోవింద్ పరాద్కర్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. వీరిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. రోడ్డుపై బోల్తా పడ్డ డీసీఎం వ్యాన్‌ను క్రేన్ సహాయంతో పక్కకు నెట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.