క్రైమ్/లీగల్

తండ్రి చేతిలో తనయుడు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, మే 18: రోజు మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తున్న కొడుకును తండ్రి, అన్న రోకలి బండతో కొట్టి హత్య చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చింతల్ భగత్‌సింగ్ నగర్‌లో నివాసం ఉంటున్న పుల్లయ్యకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు (30) ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి ఇంట్లో వారిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు తలుపు కొట్టాడు. తండ్రి తలుపు ఆలస్యంగా తీశాడని కోపంతో ఉగిపోయిన వెంకటేశ్వర్లు తండ్రి పుల్లయ్య పై చేయి చేసుకున్నాడు. ఈ ఘర్షణలో కుమారుడు శ్రీనివాస్ తమ్ముడు వెంకటేశ్వర్లును కర్రతో కొట్టగా తండ్రి పుల్లయ్య రోకలి బండతో తలపై మోదాడు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.