క్రైమ్/లీగల్

ట్రాక్టర్ ట్రక్కు కింద పడి వివాహిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, మే 18: ఇటుక బట్టీలో లోడింగ్ చేసే క్రమంలో ట్రాక్టర్ ట్రక్కు కింద పడి వివాహిత మృతి చెందిన ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెల్లటూరు గ్రామానికి చెందిన గెదేల నాగరాజు భార్య దేవమాత (27) వెల్లటూరులోని మధ్యమాలపల్లి సమీపంలో రాంబాబుకు చెందిన ఇటుకల బట్టీలో ఇటుకలు లోడింగ్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. శనివారం ఉదయం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో భర్త నాగరాజు, దేవమాతను తన ద్విచక్రవాహనంపై ఇటుక బట్టీలో ఇటుక రాళ్ళను లోడ్ చేసే నిమిత్తం దింపివేసి వచ్చాడు. అనంతరం భర్త నాగరాజు రాడ్ బెండింగ్ పనికి విజయవాడ వెళ్ళాడు. ఇటుకల బట్టీలో ఇటుకలు సర్దుతుండగా ప్రమాదవశాత్తు ట్రక్కు పక్కకు పడి, వెనుకటైరు తలపై ఎక్కి, దేవమాత తలపగిలి పోయి చనిపోయిందని మృతురాలి భర్త నాగరాజుకు అతని బావ నక్క తంబి తెలిపాడు. భర్త నాగరాజు విజయవాడ నుంచి తిరిగి వచ్చి చూసే సరికి దేవమాత చనిపోయి ఉంది. జి.కొండూరు ఎస్‌ఐ రాంబాబు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.