క్రైమ్/లీగల్

ఆన్‌లైన్‌లో గంజాయి వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 18: ఆన్‌లైన్‌లో పెద్ద మొత్తం లో గంజాయి వ్యాపారానికి పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు శనివారం గుట్టు రట్టు చేశారు. ఆన్‌లైన్‌లో గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ముఠాను ఎల్కతుర్తి పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి సుమారు 30 లక్షల విలువగల 150 కేజీల శుద్ది చేసిన గంజాయితో పాటు రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం బొనగాని బిక్షపతి, వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేశవపూర్ గ్రామానికి చెందిన తీగల రాజు, అలియాస్ చిన్నరాజు, హన్మకొండ మండలం వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన జెల్లి యాకయ్య, జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన భూపతి రావులు ఉన్నారు. పరారీలో ఉన్నావారు జఫర్‌గడ్ మండలం ముగ్ధుంతండాకు చెందిన బానోతు వీరన్న, ఆంద్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన నాయడు, వరంగల్ అర్బన్ జిల్లా కొత్తవాడకు చెందిన దేశాని రమేష్, జయశంకర్‌భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లికి చెందిన శంకర్‌లు ఉన్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ వివరాలు వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఒకడైన బోనగాని బిక్షపతితో పాటు పరారీలో ఉన్న బానోతు వీరన్న(వినోద్), నాయుడు ముగ్గురు మిత్రులు కావడంతో పాటు గతంలో వీరు చోరీలు, బందిపోటు దొంగతనాలకు పాల్పడడంతో పోలీసులు పలుమార్లు వీరిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. ఈ ముగ్గురు నిందితులు చోరీలు, బందిపోటు దొంగతానాలకు స్వస్తి పలికి మరింత సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఆన్ లైన్ ద్వారా గంజాయి వ్యాపారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా నిందితులు ముందుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి అవసరం ఉన్న వారికి సెల్ ఫోన్ ద్వారా పెద్ద మొత్తంలో ఆర్డర్లు తీసుకునేవారు. ఇలా ఆర్డర్లు స్వీకరించిన నిందితులు మరో ఆరుగురి నిందితులను తమ ముఠాలో పనిచేసేందుకుగాను నియమించుకున్నారు. నాయుడుకు తెలిసిన వ్యక్తుల ద్వారా విశాఖపట్నాం జిల్లా నుండి గంజాయిని బోలేరో లాంటి కార్లనుండి తాత్కాలికంగా రూపొందించిన రహస్య ప్రదేశంలో గంజాయిని ఉంచి వరంగల్ నగరానికి చేరవేసేవారు. అనంతరం ప్రధాన నిందితులు బానోతు వీరన్న(వినోద్) నాయుడు ఆర్డర్లు ఇచ్చిన వ్యక్తులకు గంజాయి సిద్దంగా ఉందని తమ బ్యాంక్ ఖాతాకు డబ్బు జమ చేయాల్సిందిగా సెల్‌ఫోన్ ద్వారా సంక్షిప్త సమాచారాన్ని పంపించేవారు. సదరు ఆర్డర్ చేసిన వ్యక్తుల నుండి తమ బ్యాంక్ ఖాతాలకు డబ్బు జమ అయినట్లుగా నిర్ధారించుకున్న తర్వాత నిందితులు గంజాయిని కార్ల ద్వారా మాహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కు తమ ముఠా సభ్యులతో తరలించేవారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకైడన బానోతు వీరన్న గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జఫర్‌గడ్, పాలకుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో బందిపోటు, దొంగతనాలకు సంబంధించి మూడు కేసులు నమోదు కావడంతో పాటు మధ్య ప్రదేశ్, మహారాష్టల్ల్రో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన పలు కేసులు నమోదుకాగా బోనగాని బిక్షపతిపై ఇంతజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనంతో పాటు ఆంద్రప్రదేశ్‌లో గంజాయి కేసులు నమోదైనాయి. అదే విధంగా మరో నిందితుడు నాయుడుపై ఆంద్రప్రదేశ్‌లో గంజాయి రవాణాకు సంబంధించిన పలు కేసులు ఉన్నాయి. శనివారం ఎల్కతుర్తి ప్రాంతంలో గంజాయి రవాణా జరుగుతున్నట్లు ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌కు పక్కా సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు సీఐ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి, ఎస్సై నందిరాం నాయక్‌తో పాటు ఎల్కతుర్తి ఎస్సై శ్రీ్ధర్ తన సిబ్బందితో కలిసి ఎల్కతుర్తి మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు రెండు కార్లలో గంజాయిని తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పంచుల సమక్షంలో విచారించడం

చిత్రం...అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న నిందితులు, గంజాయిని చూపుతున్న కమిషనర్ రవీందర్