క్రైమ్/లీగల్

తనుశ్రీ కేసులో భయపడుతున్న సాక్షులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 18: సినీ నటి తనుశ్రీ దత్త లైంగిక వేధింపు కేసులో ముఖ్యమైన సాక్షులు పోలీసుల ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించారని సినీ నటి తనుశ్రీ దత్తా గత ఏడాది అక్టోబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హారన్ ఓకే ప్లీజ్ చిత్ర నిర్మాణం షూటింగ్ సమయంలో పాటేకర్ చేతులు తాకడం, లైంగికంగా వేధించడం వంటివి చేసే వారని ఆమె ఆరోపించారు. ఇంకా కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమీ సిద్దిఖీ, డైరెక్టర్ రాకేష్ సారంగ్ ఉండేవారని ఆమె తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఇలాఉండగా తనుశ్రీ తరఫు న్యాయవాది నితిన్ సత్పుటే శనివారం మీడియాతో మాట్లాడుతూ తనుశ్రీ పట్ల లైంగికంగా వేధించడం గురించి ముఖ్యమైన సాక్షుల గురించి పోలీసులకు చెప్పామన్నారు. పోలీసులు సుమారు 15 మంది సాక్షుల వద్ద నుంచి సమాచారాన్ని సేకరించారని, అయితే ముఖ్యమైన సాక్షులు ముందుకు రావడం లేదన్నారు. పాటెకర్‌కు పలుకుబడి ఉంది కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ చెప్పేందుకు భయపడుతున్నారేమోనని న్యాయవాది నితిన్ తెలిపారు.