క్రైమ్/లీగల్

రవిప్రకాశ్, శివాజీ కోసం వేట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీపై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వారిద్దరిపై లుక్ అవుట్ జారీ చేసినట్టు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. వారిద్దరినీ అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రవిప్రకాశ్ పాస్‌పోర్టును పోలీసులు సీజ్ చేసిన విషయం తెల్సిందే. నటుడు శివాజీ మాత్రం తాను ఎక్కడికీ పారిపోలేదని శనివారం ఒక వీడియోను విడుదల చేశాడు. అయితే తాను ఎక్కడ ఉన్నదీ మాత్రం గోప్యంగా ఉంచారు. రవిప్రకాశ్, శివాజీ పరారీలో ఉన్న నేరస్తులుగా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరినీ గాలించి పట్టుకోడానికి మూడు పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు. రవిప్రకాశ్, శివాజీ దేశం విడిచి పారిపోకుండా, విమానాశ్రయాలు, ఓడరేవుల్లో అప్రమత్తం చేశారు. ఇద్దరి ఫొటోలను కూడా ఆయా ప్రదేశాల్లో అంటించాలని ఆదేశాలు ఇచ్చారు. టీవీ 9 సీఈవోగా రవిప్రకాశ్ పని చేస్తున్న సమయంలో సంస్థకు చెందిన నిధులను మళ్లించడంతో పాటు ముఖ్యమైన పత్రాలను ఫోర్జరీ చేసినట్లు సంస్థ డైరెక్టర్ కౌశిక్‌రావు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిప్రకాశ్, ‘గరుడ పురాణం’ శివాజీతో పాటు సంస్థ మాజీ ఫైనాన్స్ మేనేజర్ మూర్తిపై లుక్ అవుట్ జారీ చేశారు. అలాగే ఏబీసీఎల్ పత్రాల ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించారని కేసు నమోదు చేశారు. కాగా తనకు, రవిప్రకాశ్‌కు మధ్య అగ్రిమెంట్లు జరిగిన అంశం వాస్తవమేనని శివాజీ ప్రకటనలో అంగీకరించాడు. టీవీ 9 షేర్లు 2018లో కొన్నానని చెప్పాడు. టీవీ 9 సంస్థను కొత్త యాజమాన్యం అలంద కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నానని అతడు వెల్లడించారు. కాబట్టి అలంద యాజమాన్యం తనపై పెట్టిన కేసు ఎలాంటి ప్రభావం చూపదని అభిప్రాయపడ్డాడు.
ఇలా ఉండగా రవిప్రకాశ్ మామూలోడు కాదని వైకాపా సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి అన్నారు. వామ్మో రవిప్రకాశ్ అంటూ వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టారు. ‘నువ్వు మామూలోడివి కాదంటూ’ రవిప్రకాశ్ అక్రమాల పుట్టను బయటపెట్టారు. బ్రోకర్ శివాజీని పట్టకుని పోలీస్‌లు ప్రశ్నిస్తే ‘గరుడ పురాణం’ బట్టబయలవుతుందని సూచించారు. అది మీడియా రవిప్రకాశ్ పనే అంటూ ఆయన నిప్పులు చెరిగారు.

చిత్రాలు.. రవిప్రకాశ్, శివాజీ