క్రైమ్/లీగల్

ఏసీబీ దాడి కేసులో కనిపించని పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత ఏసీబీ అధికారులు సొంతంగా దాడి చేసి అరెస్టు చేసిన సెంట్రల్ ఎక్సయిజ్ కస్టమ్స్ సూపరింటెండెంట్ కేసు విషయంలో పురోగతి లేదు. కనీసం చార్జిషీటు కూడా దాఖలు చేయకపోవటంతో సెంట్రల్ ఎక్సయిజ్, కస్టమ్స్ శాఖ ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతిని రద్దు చేస్తూ గత ఏడాది ఆగస్టు 3వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ 109 జారీ చేసింది. దీని ప్రకారం గత ఏడాది నవంబర్ 30వ తేదీన మచిలీపట్నం రేంజ్ సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఎంకే రామేశ్వర్‌పై ఏసీబీ అధికారులు దాడి చేసి అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. దాడి జరిగి ఆరు మాసాలు కావస్తున్నా ఏసీబీ దర్యాప్తులో ఏ మాత్రం పురోగతి కన్పించలేదు. కనీసం చార్జీషీటు కూడా దాఖలు చేయలేదు. దీంతో గుంటూరు సెంట్రల్ టాక్స్ కమిషనర్ ఎం శ్రీహరిరావు సస్పెన్షన్‌లో ఉన్న ముద్దాయి ఎంకే రామేశ్వర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసి తిరిగి గుంటూరులో పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై ఏసీబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.