క్రైమ్/లీగల్

పోస్టల్ ఉద్యోగాల పేరిట రూ.3.57 కోట్లకు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 18 : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖలో డిజిటల్ ఇండియా పేరిట శిక్షణ కల్పించి నేరుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుండి రూ.3.57కోట్లు వసూలు చేసి భారీ మోసానికి పాల్పడిన బోగస్ సంస్థ బాగోతాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొని కుచ్చుటోపితో మోసం చేసిన ఇద్దరు నిందితులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఖరీదైన రెండు కార్లతో పాటు రూ.40లక్షల విలువైన ఫర్నిచర్‌ను స్వాదీనపర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితుడైన తహీర్ పాషాతో కలిసి ఫోర్‌స్కైర్ టెక్నో ప్రైవేట్ లిమిటెడ్ అనే బోగస్ సంస్థను 2017లో హైదరాబాద్‌లోని వనస్థలి పురంలో ప్రారంభించాడు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే డిజిటల్ ఇండియా ద్వారా పోస్ట్ఫాసుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నామని, అంతకు ముందు తాము నిరుద్యోగులకు శిక్షణ కల్పిస్తామని ఆశలు రేకెత్తించేలా వివిధ పత్రికల్లో ప్రకటనలు గుప్పించారు. కంప్యూటర్ ఆపరేటర్లను భర్తీచేసే కాంట్రాక్ట్ తమకు ముందుగా లభించిందని, అన్ని జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీచేస్తామని నమ్మిస్తూ పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడా ఏజెంట్లను నియమించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్‌కు చెందిన సయిద్ ఆహ్మాద్ నిజామాబాద్‌కు చెందిన తన స్నేహితుడి ద్వారా తహీర్ పాషాతో పరిచయం ఏర్పర్చుకొని ఫోర్ స్కైర్ టెక్నో మార్కెటింగ్‌లో ఏజెంట్‌గా చేరి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసేందుకు పతకం రూపొందించారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జి తానేనని చెబుతూ ఒక్కో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి రూ.60వేల నుండి లక్ష చొప్పున వసూలు చేశారు. సయిద్ ఆహ్మాద్ ఈబోగస్ సంస్థలో తనకున్న పరిచయాల మేరకు పలుకుబడి గల ఏజెంట్‌గా నమ్మిస్తూ తన స్నేహితుడైన ఆజ్మీర లక్ష్మణ్, అతని భార్య ఆజ్మీర రమాదేవి, అరవింద్‌పవార్, సాయన్న, అజీజ్ అనే వ్యక్తులను కూడా ఈ బోగస్ సంస్థలో ఏజెంట్‌గా చేర్చుకున్నాడు. ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన 596 నిరుద్యోగుల నుండి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చెబుతూ 3.57కోట్ల నిధులను సమీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ డబ్బుల నుండి 39 లక్షల డబ్బును ఇదే కంపెనీలోని కళ్యాణ్ కుమార్‌కు ఇవ్వగా మిగిలిన 3కోట్ల 18 లక్షల నగదును అతి తెలివిగా రియల్ ఎస్టెట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అంతేగాక ఆదిలాబాద్ శివారులో ఎస్ ఎస్ కనె్వన్షన్ సెంటర్ అనే ఫంక్షన్ హాల్‌ను నిర్మించి ఇటీవలే ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. సయిద్ బాగోతాలపై నిందితులు ఫిర్యాదు చేయగా తాము లోతైన విచారణ జరిపించి సయిద్‌తో పాటు నిందితుడైన కళ్యాణ్ కుమార్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. ఈ వ్యవహారంలో నిందితులైన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 8 మంది, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక్కరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. డబ్బులు ఇచ్చి మోసపోయిన నిందితులుపోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ పేర్కొన్నారు.