క్రైమ్/లీగల్

‘పరువు’ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 19: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో సెల్ఫీ సూసైడ్ కలకలం సృష్టించింది. వడ్డీ వ్యాపారస్థుల ఆగడాలు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత మూడు రోజుల క్రితమే ఓ ప్రార్థనా మందిరంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆ యువకుడి మరణం వెనుక వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు ఉన్నట్టు ఆదివారం బహిర్గతమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సర్కారుతోటకు చెందిన తోపుల నాగ భాను ప్రకాష్ (27) ఈ నెల 16వతేదీన బందరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ శివారు రామానగరంలోని ఓ ప్రార్థనా మందిరంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. దీనిపై తాలుకా పోలీసు స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. విచారణలో భాగంగా ఆదివారం మృతుని స్నేహితులు మృతుని సెల్‌ఫోన్‌ను చూడగా ఓ సెల్ఫీ వీడియో కనిపించింది. ఆ సెల్ఫీ వీడియోలో భాను ప్రకాష్ తన చావుకు గల కారణాలు అన్నీ తెలిపాడు. భానుప్రకాష్ తన స్నేహితుడైన అఖిల్ తండ్రి గోపి వద్ద కొంత మొత్తాన్ని రూ.5లు వడ్డీకి తీసుకున్నాడు. వడ్డీ చెల్లింపు సమయంలో రూ.5లు కాదని రూ.10లు వడ్డీ ఇవ్వాలంటూ గోపి ఒత్తిడి చేశాడు. ఆ మేరకు రూ.10లకు వడ్డీ చెల్లించాడు. ఆ తర్వాత మళ్లీ ఇంటి అవసరాల కోసం రూ.20వేలు తీసుకున్నాడు. వడ్డీ డబ్బుల కోసం తీవ్రమైన ఒత్తిడి చేశారు. ఈ క్రమంలోనే మృతుని ద్విచక్ర వాహనంతో పాటు అతని అమ్మమ్మకు చెందిన ఏటీఎం కార్డును పది మంది ముందు తీసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురై మృతుడు భాను ప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని సెల్ఫీలో వివరించి తన మరణ వాంగ్మూలం ఇచ్చాడు. దీనిపై బందరు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.