క్రైమ్/లీగల్

వేధింపుల భర్తను కొట్టి చంపిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందర్లపాడు, మే 19: మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తను సహనం కోల్పోయి తలపై ఇనుప గొట్టంతో కొట్టటంతో మృతి చెందిన సంఘటన మండలంలోని మునగాలపల్లిలో శనివారం రాత్రి జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం మునగాలపల్లికి పిడతల సురేష్‌కు అదే గ్రామానికి చెందిన హేమలతతో 15 సంవత్సరాల క్రిందట వివాహం జరిగింది. మద్యానికి బానిసైన సురేష్ హేమలతను హింసిస్తూ ఉండేవాడు. రెండు రోజుల క్రిందట తన అక్క గుంటక రాణి ఇంటికి హేమలత వెళ్లింది. దాంతో రాణి ఇంటికి సురేష్ వెళ్లి తీవ్ర అసభ్య పదజాలంతో మాట్లాడగా సహనం కోల్పోయిన హేమలత పొయ్యి గొట్టంతో తలపై కొట్టగా సురేష్ మృతి చెందినట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.