క్రైమ్/లీగల్

మహిళా కౌన్సిలర్ భర్తపై లైంగిక వేధింపుల కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, మే 19: భాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా కౌన్సిలర్ భర్త జో శ్రీనివాస్‌పై పోక్సో చట్టంతో పాటు 506, 509 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌హెచ్‌ఓ రాఘవేందర్ ఆదివారం తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్‌లో 5వ వార్డు పరిధిలో నివాసం ఉంటున్న ఓ మైనర్‌తో అదే వార్డుకు చెందిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ మహిళా కౌన్సిలర్ లత భర్త జో శ్రీనివాస్ పరిచయం పెంచుకున్నాడు. సంవత్సర కాలం నుంచి ఆ బాలికకు, కౌన్సిలర్ భర్త జో శ్రీనివాస్‌కు మధ్య ఫోన్ సంభాషణలతో పాటు వాట్సాప్ చాటింగ్‌లు కొనసాగుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలంటూ ఆ బాలికను జో శ్రీనివాస్ వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై తరచూ ఇంట్లో కౌన్సిలర్ అయిన భార్య లతతో జో శ్రీనివాస్ గొడవలకు దిగుతున్నట్టు తెలిసింది. తాను ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూ ఇంట్లో గొడవకు దిగుతుండడంతో రెండు రోజుల క్రితం మహిళా కౌన్సిలర్ లత ఆ అమ్మాయి ఇంటికి వెళ్లింది. ఇంటి సభ్యుల ముందే ఆ అమ్మాయిని మహిళా కౌన్సిలర్ తీవ్ర పదజాలంతో దూషించడం, మరోసారి తన భర్త జోలికి రావద్దని హెచ్చరించిందని కాలనీవాసులు చెప్పారు. ఈ సంఘటన జరిగిన రెండో రోజే ఆ బాలిక కొన్ని రోజుల నుంచి మహిళా కౌన్సిలర్ లత భర్త జో శ్రీనివాస్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో పాటు పెళ్లి చేసుకోవాలంటూ ఇబ్బంది పెడుతున్నాడని శనివారం రాత్రి ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై విచారించిన అనంతరం మహిళా కౌన్సిలర్ భర్త జో శ్రీనివాస్‌పై పోక్సో చట్టం, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌హెచ్‌ఓ రాఘవేందర్ తెలిపారు. బాలిక తండ్రితో రాజీ కుదర్చడానికి కొందరు నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. శనివారం రాత్రి వరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో అధికార పార్టీ నాయకులు తమ ప్రయత్నాలు విరమించుకున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం జో శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంవత్సరం క్రితం బెంగాలి వర్కర్ భూపాల్ వద్ద నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్ భర్త సంజయ్‌సింగ్ బబ్లూ, జంభిహనుమాన్ మందిర కమిటీ చైర్మన్ సుంకరి రంగన్న, మహిళా కౌన్సిలర్ భర్త పింజ వినోద్‌లు కలిసి బంగారం లాక్కున్న సంఘటన మరువకముందే మరో సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆనాడు బంగారం లాక్కున్న సంఘటనలో ఆ ముగ్గురిపై కేసు నమోదైంది.