క్రైమ్/లీగల్

జీలుగు కల్లుకు ఇద్దరు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు/ జి. మాడుగుల: ఇంటికి వంట చెరుకుకోసం గ్రామ సమీపంలో అడవికి వెళ్లిన ఏడుగురు గిరిజనులు దాహాన్ని తట్టుకోలేక అడవిలో సహజంగా లభించే కల్తీ కల్లు సేవించి ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గిరిజనులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విశాఖ జిల్లా పెదబయలు మండలం బొంగరం పంచాయతీ చిట్రకాయపుట్టు గ్రామంలో జరిగిన ఈ ఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బి.చిన్నబుల్లమ్మ, వి.్భగవతి, బి.రాంబాబు, వి.నానిబాబు, బి.మధు, బి.విష్ణుమూర్తి, బి. చిన్నకొండబాబు ఆదివారం కట్టెల కోసం గ్రామ సమీపంలో అడవి వైపు వెళ్లారు. ఎండ తీవ్రతతో గొంతు ఎండి పోతుండటంతో అడవిలో సహజంగా దొరికే జీలుగు కల్లును జీలుగు చెట్టు నుంచి సేకరించి సేవించారు. అడవికి వెళ్లిన వీరు ఆదివారం సాయంత్రం పొద్దుపోయే వరకు ఇంటికి చేరకపోవడంతో గ్రామస్తులు అడవిలో గాలించారు. ఒకచోట వీరంతా పడి ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పరీక్షించి చూశారు. కల్తీ జీలుగు కల్లు తాగిన వీరిలో బి.చిన్నబుల్లమ్మ (55), వి.్భగవతి (13) అక్కడికక్కడే మృతి చెందినట్టు నిర్ధారించుకుని మిగిలిన ఐదుగురు గిరిజనులను గ్రామానికి తీసుకువచ్చి సపర్యలు చేసి సోమవారం ఉదయం పాడేరు అసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. చిట్రకాయ పుట్టులో గిరిజనులు సేవించిన జీలుగు కల్లులో విషపూరిత పదార్ధాలు ఉండటం వల్ల మృతి చెంది ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.