క్రైమ్/లీగల్

ఇద్దరు జనశక్తి కొరియర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మే 20: తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి సమావేశం అవుతున్నట్టు సమాచారం అందుకుని ఇద్దరు సీపీఐ (ఎంఎల్) జనశక్తి కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు అరెస్టు అయిన మానుక కుంటయ్య (45), నగునూరి రవి (30) నుండి ఒక నాటు తపంచా, 12 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వేములవాడ మండలం గొల్ల తిప్పాపూర్ గ్రామానికి చెందిన మానుక కుంటయ్య, నగునూరి రవి తంగళ్ళపల్లి మండలం రామన్నపల్లె చెందిన మరో ఇద్దరు కలిసి సిరిసిల్ల బైపాస్ రోడ్డులో సీపీఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్ సూచన మేరకు సమావేశం అయ్యారు. జిల్లాలో పార్టీని బలపేతం చేయడానికి, టార్గెట్ వ్యక్తులను బెదిరించి, భయపెట్టి డబ్బులు వసూలు చేయాలని సమావేశం అయినట్టు చెప్పారు. దీనిపై పక్కా సమాచారం మేరకు సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, పోలీసుల బృందం దాడి చేసి ఒక నాటు తపంచా, 8 ఎంఎం రౌండ్లు 12 స్వాధీనం చేసుకున్నారు. మానుక కుంటయ్య గతంలో సుద్దాల ప్రభాకర్‌రావు హత్య కేసులో నిందితుడని, ఈ కేసు ప్రస్తుతం ట్రయల్‌లో ఉందన్నారు. ఇతడు తన స్థిరాస్తులను, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి విశ్వనాథ్‌తో సన్నిహితంగా ఉంటూ కొరియర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోలీసు శాఖ గట్టి నిఘా పెట్టి సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి ఆట కట్టించారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన సీఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్ళు జగదీష్, పుల్కం శ్రీను, పోలీసు బృందాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. వారి కృషికి తగిన రివార్డు కూడా త్వరలో అందిస్తామని ఎస్పీ తెలిపారు.
కాగా అరెస్టు అయిన మానుక కుంటయ్య నుండి తపంచా, ఆరు తూటాలు, నగునూరి రవి నుండి ఆరు తూటాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.