క్రైమ్/లీగల్

రామేశ్వరం దేవాలయంలో దొంగల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 20: తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఫరూఖ్‌నగర్ మండలం శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారు జామున సుమారు రెండు గంటల సమయంలో గుర్తు తెలియని దొంగలు దేవాలయంలోకి చోరబడి హుండీని ధ్వంసం చేసి సుమారు మూడు లక్షల నగదు దోచుకేళ్లినట్లు పోలీసులు తెలిపారు. దేవాలయం శ్యాంసుందర్ చారి, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్ మండలం రామేశ్వం గ్రామ పంచాయతీలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం తెల్లవారు జామున గుర్తు దొంగల ముఠా రోడ్డు భాగం నుండి దేవాలయంలోకి చోరబడి హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును దో చుకుపోవడంతోపాటు ఒక హుం డీని సమీపంలో గుట్టల మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన హుండిని మహాశివరాత్రి ఉత్సవాల (జాతర) నుండి లెక్కించలేదని, మరో మూడు రోజుల్లో లెక్కిద్దామని ఆశించినప్పటికి నిరాశే మిగిలిపోయిందని వివరించారు. దొం గతనం జరిగిన విషయాన్ని ఆల య అధికారులు, పూజారులు షా ద్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన సం ఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించా రు. దేవాలయానికి వచ్చిన భక్తులు దొంగతనానికి పాల్పడ్డారా లేక చుట్టుపక్కల వాళ్ళు వచ్చారా..లేక అంతరాష్ట్ర దొంగల ముఠా ఏమైనా వచ్చిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండీ చోరి కావడంతో స్థానిక భక్తులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు లేనిది ప్రస్తుతం ఇలా ఎందుకు జరిగిందని భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
దేవాలయం ఇఓ శ్యాంసుందర్‌చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.