క్రైమ్/లీగల్

ఎన్నికలు పూర్తయ్యాయి కదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల పరిశీలకులుగా పదవీ విరమణ చేసిన ఇద్దరు అధికారులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పోలింగ్ ముగిసిపోయినందున పిటిషన్‌ను విచారణకు చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల సెంట్రల్ పోలీసు పరిశీలకునిగా వివేక్ దూబే, పశ్చిమ బెంగాల్ ప్రత్యేక అబ్జర్వర్‌గా అజయ్ నాయక్‌ను కేంద్రం నియమించింది. తమకు అనుకూలురైన అధికారులనే కేంద్రం నియమించుకుందని, అదీ ఎన్నికల్లో ప్రయోజనం కోసమేనని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు మంగళవారం పిటిషన్ వచ్చింది. ‘ఆర్టికల్ 32 కింద పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేం. అలాగే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని బర్రాక్‌పోర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాము మండి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారణకు స్వీకరించేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం పిటిషనర్ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించమని సలహా ఇచ్చింది. బర్రాక్‌పోర్‌తో సహా ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఐదో విడతలోనే పోలింగ్ పూర్తయింది. పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది బర్రాక్‌పోర్‌లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అయితే పోలింగ్ పూర్తయిందని ఫలితాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు కాబట్టి విచారించాలని పిటిషనర్ తరఫున్యాయవాది బెంచ్‌ను అభ్యర్థించారు. ‘ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు’అని న్యాయవాది స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు ‘మీరు హైకోర్టు వెళ్లొచ్చు. మీకు ఆ స్వేచ్ఛను ఇస్తున్నాం’అని పిటిషనర్‌కు తెలిపారు. కోల్‌కతాలో న్యాయవాదులు సమ్మెలో ఉన్నందున కార్యకలాపాలు సాగడం లేదని అందుకే సుప్రీంను ఆశ్రయించినట్టు పిటిషనర్ పేర్కొన్నారు. ఓ వర్గానికి కొమ్ముకాయడం కోసమే పరిశీలకులను ఏర్పాటు చేశారని, ఇది పూర్తిగా వివక్షపూరితంగా సాగిందని ఆయన ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగా తనకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎందరో నిష్ణాతులైన అధికారులుండగా పదవీ విరమణ చేసిన వారిని నియమించడం వెనక పెద్ద కుట్ర ఉందని రాము మండి తెలిపారు. అబ్జర్వర్ల నియామకం చట్టవిరుద్ధమని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద దూబే, నాయక్ నియామకం చెల్లుబాటు కాదని ఆయన అన్నారు. ఎందరో అధికారులుండగా పదవీ విరమణ చేసిన వారిని నియమించడాన్ని పిటిషన్ ఆక్షేపించారు. మండి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 6న ఈసీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ధర్మాసనం వివరణ కోరింది.