క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకిపురం, మే 21: చిత్తూరు జిల్లా కలికిరి మండలంలోని మర్రిగుంటపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో విఆర్‌వోగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ నాలుగు వేల రూపాయలు ఓ రైతు వద్ద నుండి లంచం తీసుకుంటూ మంగళవారం ఏసిబి అధికారులకు పట్టుబడ్డాడు. మర్రికుంటపల్లె పంచాయతీలో తమ భూములకు సంబంధించిన మ్యుటేషన్ కోసం హర్షద్‌అలీ అనే రైతు విఆర్‌వో కోరాడు. ఇందుకోసం 5వేల రూపాయలు ముట్టచెప్పాడు. అయితే విఆర్‌ఓ మరో ఐదువేలు ఇస్తేనే పనిచేస్తానని చెప్పడంతో రైతు హర్షద్‌అలీ ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మంగళవారం మరోమారు నాలుగు వేలు రూపాయలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా విఆర్‌వో ఏసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఈ దాడుల్లో ఏసిబి అడిషనల్ ఏస్పీ తిరుమల ఈశ్వర్‌రెడ్డి, డీయస్పి సుధాకర్, సి ఐలు గిరిధర్‌విజయ్‌శేఖర్, ప్రసాద్‌రెడ్డి, రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు.