క్రైమ్/లీగల్

సీజే తీర్పును సవరించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పోలైన ఓట్లతో సమానంగా వీవీ ప్యాట్‌లలో నమోదైన స్లిప్పులు లెక్కించాలని దాఖలైన పిటిషనను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నైకి చెందిన ‘టెక్ ఫర్ ఆల్’ అనే సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా అధ్యక్షతన గల డివిజన్ బెంచ్ మంగళవారం తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన గల డివిజన్ బెంచ్ ఇటీవల ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సమానంగా వీవీ ప్యాట్లతో నమోదైన స్లిప్పులను సైతం లెక్కించాలని వచ్చిన డిమాండ్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ‘ఈ అంశంపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఇదివరకే స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మళ్లీ ఇపుడు ఇదే అంశంపై ఎందుకు వచ్చారు’ అని కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ‘సీజే ఇచ్చిన తీర్పును మేం సవరించలేం. ఇలాంటి అర్థం, పర్థం లేని పిటిషన్లను మేం విచారించలేం. అందుకే దీనిని నిర్ద్వంద్వంగా కొట్టివేస్తున్నాం’ అని జస్టిస్ మిశ్రా స్పష్టం చేశారు. ఇదిలావుండగా, చంద్రబాబునాయుడు నాయకత్వంలో 21 మంది ప్రతిపక్ష నాయకులు ఈవీఎంలలో నమోదైన ఓట్లలో కనీసం 50 శాతం వీవీ ప్యాట్లలో నమోదైన స్లిప్పులతో సమానంగా లెక్కించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ పిటిషన్‌ను ఈ నెల 7న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్లను లెక్కిస్తే సరిపోతుందంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయడంతో దానిని కొట్టివేసిన విషయం తెలిసిందే.