క్రైమ్/లీగల్

మహిళ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, మే 21: మతిస్థిమితం లేని మహిళ కావాలోని బాయి తండాకు చెందిన ముడవత్ భారతి 33 సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని ఆమె భర్త ముడవత్ రవి మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భారతికి గత మూడు నెలలుగా మతిస్థిమితం లేదు దీంతో భర్త ఆమెకు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నాడు. మహేశ్వరం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే బస్‌లో ఎక్కి వెళ్లిందని స్థానికులు చెప్పారు. రాత్రివరకు తిరిగి ఇంటికి రాలేదు దీంతో చుట్టు పక్కల బంధువుల ఇళ్లలో అమె ఆచూకీ కోసం గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిస్తే మహేశ్వరం పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై శ్రీనివాస్ రెడ్డి సూచించారు.