క్రైమ్/లీగల్

వాటర్ ట్యాంకర్ ఢీకొని బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 21: వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాచుపల్లి గ్రా మం, రాజీవ్ గాంధీ నగర్‌లో నివాసముండే తప్పేటి జగదీశ్ కూలి పనులు చేస్తుంటాడు. కుమారుడు రాకేశ్ (13) విద్యార్థి ఇంట్లో నుండి జ్యూస్ తీసుకురావడానికి రాజీవ్ గాంధీ నగర్‌కు వెళ్తుండగా టీఎస్10 యూఏ 5410, గల వాటర్ ట్యాంకర్ నిజాంపేట్ నుంచి బాచుపల్లి వైపు వెళ్తూ రాకేశ్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలకు గురైన రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.