క్రైమ్/లీగల్

సాగర సంగమంలో యువకుడి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, మే 21: కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమంలో స్నేహితులతో విహార యాత్రకై వచ్చిన ఓ యువకుడు గల్లంతైన సంఘటన మిష్టరీగా మారింది. గుడివాడకు చెందిన పరిశే అరవింద్ విహారి (18) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్నాడు. అరవింద్ సోమవారం మధ్యాహ్నం తన మిత్రులతో కలిసి సాగర సంగమానికి వచ్చారు. కృష్ణానది, సముద్రం ఒక చోట కలిసే ప్రాంతంలో వీరు స్నానం చేస్తుండగా అరవింద్ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. అయితే ఈ విషయాన్ని స్నేహితులు రాత్రి పొద్దుపోయే వరకు ఎవరికీ చెప్పలేదు. అరవింద్ గల్లంతైన తర్వాత సహచర స్నేహితులైన చందరు, శివ సాయి, తిరుమల వెళ్లిపోయి మళ్లీ రాత్రి 10గంటల సమయంలో రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదయం 7.30గంటలకు గుడివాడలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు బీచ్ వద్దకు చేరుకున్నామని, డాల్ఫిన్ భవనం ఎదురుగా బీచ్‌లో స్నానం చేసిన తరువాత సంగమం ప్రదేశం వద్దకు వెళ్లామని అక్కడ మిగిలిన ముగ్గురు మిత్రులు ఒడ్డున ఉండగా అరవింద్ ఒక్కడే స్నానానికి దిగి నీటి లోతుకు వెళ్లి మునిగిపోయినట్లుగా పోలీసులకు ఇచ్చిన స్టేట్ మింట్‌లో మిగిలిన ముగ్గురు మిత్రులు పేర్కొన్నారు. ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉండగా ఎస్‌ఐ ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి మంగళవారం ఉదయం అవనిగడ్డ సీఐ శ్రీ్ధర్ కుమార్, కోడూరు తహశీల్దార్ నరసింహమూర్తి, ఎస్‌ఐ ప్రియ కుమార్ ముగ్గురు మిత్రులను వివరించారు. మెరైన్, సివిల్ పోలీసులు బృందాలుగా విడిపోయి కృష్ణానది పాయల వెంబడి గాలింపు చేపట్టినా అరవింద్ ఆచూకీ లభ్యం కాలేదు. తండ్రి శ్రీను చేతికి వచ్చిన కొడుకు ఇలా బలవటాన్ని తట్టుకోలేకపోతున్నారు. గతంలో ఇలాగే ప్రమాదాలు జరిగి యువకులు మృతి చెందిన సంఘటనల్లో వచ్చిన వారు వెంటనే అక్కడున్న మెరైన్ పోలీసులకు సహాయం కోసం అర్ధించేవారు. కానీ సోమవారం జరిగిన ఘటనలో యువకుడు గల్లంతైన తరువాత వారంతటి వారే మేము ఎంత సేపు వెదికినా కనపడకపోవటంతో గుడివాడ వెళ్లిపోయాని చెప్పటం మిస్టరీగా మారింది.