క్రైమ్/లీగల్

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మే 21: మహబూబాబాదాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం పోలీసులు అంతరాష్ట్రీయ గంజాయి ముఠాను పట్టుకొన్నారు. వారి నుండి 12 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేఖరులు సమావేశంలో వివరాలను వెల్ల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మండలం వైరామవరం పాలకొండకు చెందిన కొర్ర సాయి, పంగి రమేష్, కొర్ర శ్రీనాథ్, మరిగెల రమేష్‌తో పాటు మరో వ్యక్తి కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. నర్సీపట్నం, విశాఖపట్నం, ఒడిసా ప్రాంతాల నుండి ఎండుగంజాయి కిలోకు వెయ్యి చొప్పున ఖరీదు చేసి, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారన్నారు. ఇదే క్రమంలో మంగళవారం 110 కిలోల గంజాయిని తీసుకువచ్చి భద్రాచలం మీదుగా మహబూబాబాద్, కేసముద్రం మార్గాన ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వచ్చారు. కేసముద్రం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఐదుగురు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతూ కనిపించడంతో వారి వద్దకు వెళ్లి సంచులను తనిఖీ చేయడానికి సిద్ధపడుతుండగా, సంచులను వదిలి పారిపోయేందుకు యత్నించగా, చాకచక్యంగా నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. సంచులను తనిఖీ చేయగా ఎండు గంజాయి లభించింది. ఈ ఘటనలో ఒకరు పారిపోయారు. కేసముద్రం తహశీల్దార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన కేసముద్రం ఎస్ ఐ సతీష్, మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.