క్రైమ్/లీగల్

చెరువులో మునిగి అన్నదమ్ములు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 21 : ఈత నేర్చుకుందామన్నా సరదా అన్నదమ్ములిద్దర్ని బలిగొంది. నిండు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే రోజు ఇద్దరు కొడుకులు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అన్నదమ్ములు ఈత నేర్చుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కోమటిచెరువులో మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన బదనపురం కిషన్, కనకవ్వలకు నల్గురు కుమారులున్నారు. వీరిలో చిన్నవారైన గణేశ్ (14) లక్ష్మణ్ (10) హనుమాన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో గణేశ్ 5వ తరగతి, లక్ష్మణ్ 3వ తరగతి చదువుతున్నారు. గణేశ్, లక్ష్మణ్‌లు ఈత నేర్చుకోవటానికి అదే ప్రాంతానికి చెందిన మరో స్నేహితుడితో కలసి కోమటిచెరువుకు వెళ్లారు. వచ్చిన స్నేహితుడు చెరువు గట్టుపై కూర్చున్నాడు. అన్నదమ్ములు గణేశ్, లక్ష్మణ్ చెరువు గట్టుపై బట్టలు విప్పి ఈత నేర్చుకునే యత్నంలో చెరువులో మునిగిపోయారు. వీరిని చూసిన స్నేహితుడు పరిగెత్తుకు వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చే సరికి చెరువులో అన్నదమ్ములు మునిగిపోయారు. పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లు వచ్చి చెరువులో వెతికి గణేశ్, లక్ష్మణ్ మృతదేహాలను వెలికి తీశారు. సంఘటనా స్థలాన్ని వన్‌టౌన్ సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్ సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్న కొడుకుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.