క్రైమ్/లీగల్

గ్యాంగ్‌స్టర్ నరుూమ్ సోదరి, బావ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, మే 21: భయభ్రాంతులకు గురిచేసి భూ ఆక్రమణ చేసిన కేసులో గ్యాంగ్‌స్టర్ నరుూమ్ సోదరి అయేషా, బావ మహ్మద్ అబ్దుల్ సలీంలను అరెస్టుచేసి కోర్టుకు రిమాండ్ చేసినట్టు రాచకొండ కమిషనరేట్ భువనగిరి ఏసీపీ భుజంగరావు తెలిపారు.
మంగళవారం భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో భుజంగరావు ఆయేషా, అబ్దుల్ సలీంల అరెస్టు వివరాలను తెలియజేసారు. గ్యాంగ్‌స్టర్ బతికున్న కాలంలో భూ యజమానులను భయభ్రాంతులకు గురిచేసి భూములను లాక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా నమోదైన 351/16, 352/16, 446/16, 13/17, 60/17, 352/16 కేసులలో నరుూం సోదరి ఆయేషా, బావ అబ్దుల్ సలీంలు ప్రధాన నిందితులని తెలిపారు. బెదిరించి ఆక్రమించుకున్న భూములను ఆయేషా, అబ్దుల్ సలీంల పేరున రిజిస్ట్రేషన్ చేపట్టి తిరిగి ఇతరులకు అమ్మేవారని ఆయన వివరించారు. 6 కేసులలో ప్రధాన ముద్దాయిలైన ఆయేషా, అబ్దుల్ సలీం మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలోని కోహెడ గ్రామంలో ఉన్నట్టు పక్కాగా సమాచారం అందడంతో వారిని డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావు పర్యవేక్షణలో భువనగిరి పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎం.సురేందర్, ఎస్సై నాగిరెడ్డి, మరికొంతమంది పోలీస్ సిబ్బంది వలపన్ని పట్టుకున్నట్టు ఆయన తెలియజేసారు. అరెస్టుచేసిన ఆయేషా, అబ్దుల్ సలీంలను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం కోర్టుకు రిమాండ్ చేసినట్టు తెలియజేసారు.

చిత్రాలు.. నిందితులు ఆయేషా, అబ్దుల్ సలీం
* విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ భుజంగరావు